AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా’ వివాదంలోకి మళ్లీ ‘శ్రీరెడ్డి’..! ఈ సారి టార్గెట్ ఎవరంటే..?

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్‌లో జరుగుతోన్న వివాదంలోకి.. శ్రీరెడ్డి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె చర్యలు నిజంగానే ఊహాతీతం. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో.. ఎందుకు చేస్తుందో.. ఎవరికీ తెలియదు. ఆమెకు నచ్చింది చేసుకుంటూ.. వెళ్తుంది. ఒకప్పుడు ‘మా’లో.. తన అర్థనగ్న నిరసనతో.. పెద్ద దుమారం రేపింది శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని.. కమిట్‌మెంట్ ఇస్తేనే.. ఛాన్సులు ఇచ్చేవారని.. ‘మా’ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేసింది. ఇక అప్పటి నుంచి.. మా సభ్యులకు సంబంధించిన […]

'మా' వివాదంలోకి మళ్లీ 'శ్రీరెడ్డి'..! ఈ సారి టార్గెట్ ఎవరంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 24, 2019 | 4:05 PM

Share

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్‌లో జరుగుతోన్న వివాదంలోకి.. శ్రీరెడ్డి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె చర్యలు నిజంగానే ఊహాతీతం. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో.. ఎందుకు చేస్తుందో.. ఎవరికీ తెలియదు. ఆమెకు నచ్చింది చేసుకుంటూ.. వెళ్తుంది. ఒకప్పుడు ‘మా’లో.. తన అర్థనగ్న నిరసనతో.. పెద్ద దుమారం రేపింది శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని.. కమిట్‌మెంట్ ఇస్తేనే.. ఛాన్సులు ఇచ్చేవారని.. ‘మా’ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేసింది. ఇక అప్పటి నుంచి.. మా సభ్యులకు సంబంధించిన విషయాలపై, టాలీవుడ్‌కి సంబంధించిన వ్యక్తులపై ఎప్పుడూ వెటకారంగా.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉంటోంది. తాజాగా.. మా అధ్యక్షుడు నరేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ తాజా వ్యాఖ్యలతో.. మరోసారి వార్తల్లోకెక్కింది శ్రీరెడ్డి.

‘నరేష్ సగం గోచి నువ్వే విప్పేసుకున్నావ్.. సగం గోచి ‘మా’ మెంబర్స్ లాగేశారు’ అంతేకాకుండా.. మరో పోస్ట్ ‘నరేష్‌గా నీ లాగ్ డైలాగ్స్ ఎంట్రా బాబాయ్.. దానికి తోడు కాకి స్వరం.. దిగిపోరా నీకెందుకు మా అసోసియేషన్’ అని శ్రీరెడ్డి తాజాగా చేసిన పోస్టులపై.. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేస్తోంది. ఒక సీనియర్ యాక్టర్‌ అయిన నరేష్‌పై ఇలా కామెంట్ చేయడమేంటని.. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విబేధాలు తలెత్తాయి. ఫండ్స్‌కు సంబంధించి వారి మధ్య విబేధాలు వచ్చాయి. గత 9 నెలలుగా మాలో ఏం జరుగుతోంది..? ఎంత ఫండింగ్ అందింది..? అనే వాటిపై రాజశేఖర్‌, జీవితలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో.. నరేష్, రాజశేఖర్‌, జీవితల మధ్య దూరం పెరిగింది. దీంతో.. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని.. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని వారు అన్నారు.

కాగా.. ఇదిలా ఉండగా.. దీనిపై జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం జరిగిన సమావేశం నిర్విరామంగా.. ప్రశాంతంగా.. జరిగిందని తెలిపారు. కానీ.. మీడియాలో మాత్రం.. ఏవోవో గొడవలు జరిగాయని చెప్పారు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో నాకు చాలా మెసేజ్‌లు, కాల్స్ వచ్చాయి. మా మధ్య కొన్ని ఆర్గ్యూమెంట్స్‌ జరిగిన మాట వాస్తవమే కానీ.. మీ మీటింగ్.. ప్రశాంతంగా జరిగిందని చెప్పుకొచ్చారు.