శ్రీముఖికి వాళ్ళిద్దరితో టఫ్ ఫైట్.. ఇదే బిగ్ బాస్ సీక్రెట్ ప్లాన్..?

బిగ్ బాస్ మరో రెండు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా.. అందులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక ఆ మరుసటి వారం టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్‌ టికెట్ టు ఫినాలే అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో అతను నేరుగా ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అటు ఈ వారం మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి.. మిగిలిన నలుగురు ఫైనల్స్‌కు చేరుకుంటారు. అయితే ఫైనల్స్ వరకు […]

శ్రీముఖికి వాళ్ళిద్దరితో టఫ్ ఫైట్.. ఇదే బిగ్ బాస్ సీక్రెట్ ప్లాన్..?
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 24, 2019 | 4:01 PM

బిగ్ బాస్ మరో రెండు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా.. అందులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక ఆ మరుసటి వారం టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్‌ టికెట్ టు ఫినాలే అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో అతను నేరుగా ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

అటు ఈ వారం మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి.. మిగిలిన నలుగురు ఫైనల్స్‌కు చేరుకుంటారు. అయితే ఫైనల్స్ వరకు ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నా.. టైటిల్ అనౌన్స్ చేసేటప్పుడు మాత్రం ఇద్దరే ఉంటారు. ఇక ఆ ఇద్దరిలో ఎవరు విన్నర్ అనేది హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లి వారిని తీసుకుని వస్తాడు. ఇంతకీ ఈ సీజన్ టైటిల్ విజేత అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే.. వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లని నెటిజన్లు అంటున్నారు.

ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్ ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కానీ కిందటి వారం భార్యను కాపాడే ప్రయత్నం అది కాస్తా తగ్గిపోయింది. అటు రాహుల్ ఊహించని విధంగా ఫైనల్‌కు చేరాడు. మరోవైపు శ్రీముఖి టాప్ 3లో ఉంటుందని సమాచారం. శ్రీముఖికి బయట విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెను విజేతగా చేస్తారని కొందరి మాట.

మరోవైపు శ్రీముఖిని కావాలనే బిగ్ బాస్.. టాప్ ప్లేస్‌లోకి రాకుండా చేస్తున్నారని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్కులను పరిశీలిస్తే.. వరుణ్- రాహుల్, బాబా భాస్కర్ – అలీ, శ్రీముఖి- శివజ్యోతిల మధ్య టఫ్ ఫైట్ పెట్టాడు. కానీ సడన్‌గా బాబా భాస్కర్, అలీల టాస్క్‌ను మాత్రమే కాకుండా శ్రీముఖిది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనితో మళ్ళీ ఆ ఐదుగురికి వివిధ రకాల టాస్కులు  ఇచ్చాడు బిగ్ బాస్. అందులో శ్రీముఖికి మరీ విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు.

చేప నోట్లో మౌత్ ఆర్గాన్ ఉంచి.. దాన్ని మరోవైపు నుంచి శ్రీముఖి ఊదాలి. ముందు కాస్తా అసహ్యించుకున్నా.. తప్పక చేపను ఒళ్ళో పెట్టుకుని ఊదింది. ఆ తర్వాత కొద్దిసేపటికి బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. మొత్తం మీద శ్రీముఖి తన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం కావాలనే బిగ్ బాస్.. శ్రీముఖిని టార్చర్ చేస్తున్నాడని.. రీసెంట్‌గా ఇంట్లోకి శ్రీముఖి అమ్మ వచ్చినప్పుడు కూడా వారిద్దరిని కలవనివ్వకుండగా.. అతిగా ప్రవర్తించాడని వారు మండిపడుతున్నారు.

ఏది ఏమైనా శ్రీముఖికి మాత్రం రాహుల్, వరుణ్/ బాబా భాస్కర్ రూపంలో ఫైనల్‌లో టఫ్ ఫైట్ పడేలా కనిపిస్తోంది. అటు అలీ రెజాను కూడా తక్కువ అంచనా వేయలేం. అతనికి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అంతేకాక బయటికి వెళ్లి.. మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వడం తప్పితే చెప్పుకోదగ్గ మైనసులు లేవు.