శ్రీముఖి బ్రేకప్ లవ్ స్టోరీ.. రాములమ్మ జీవితంలో విలన్ అతడేనా?

బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో కంటెస్టెంట్లు తమ సీక్రెట్ లైఫ్స్ గురించి చెప్పాలంటూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖి తన వ్యక్తిగత విషయాల్లోని సంచలన నిజాలు బయటపెట్టింది. గతంలో తనకు ఓ లవ్ స్టోరీ ఉండేదని.. అన్నీ సెట్ అయ్యి.. పెళ్లి చేసుకుందాం అనుకునే సరికి గట్టి షాక్ తగిలిందని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ప్రొఫెషనల్ పరంగా అందనంత హైట్స్‌కు రీచ్ అవుతున్న సమయంలో లేనిపోని మనస్పర్థలు […]

శ్రీముఖి బ్రేకప్ లవ్ స్టోరీ.. రాములమ్మ జీవితంలో విలన్ అతడేనా?
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 25, 2019 | 10:12 AM

బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో కంటెస్టెంట్లు తమ సీక్రెట్ లైఫ్స్ గురించి చెప్పాలంటూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖి తన వ్యక్తిగత విషయాల్లోని సంచలన నిజాలు బయటపెట్టింది. గతంలో తనకు ఓ లవ్ స్టోరీ ఉండేదని.. అన్నీ సెట్ అయ్యి.. పెళ్లి చేసుకుందాం అనుకునే సరికి గట్టి షాక్ తగిలిందని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

ప్రొఫెషనల్ పరంగా అందనంత హైట్స్‌కు రీచ్ అవుతున్న సమయంలో లేనిపోని మనస్పర్థలు వచ్చాయని.. దానితో అగ్లీ సిచ్చువేషన్స్ ఎదురయ్యానని తనలోని బాధను వ్యక్తం చేసింది. అంతేకాక తన జీవితంలో ఉన్నది కూడా ఓ సెలెబ్రిటీ అని శ్రీముఖి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారం ఆగిపోవడంతో చచ్చిపోదామనుకున్నట్లు తెలిపింది శ్రీముఖి. తాను మేకప్ రూమ్‌కి వెళ్లి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని శ్రీముఖి తన గతాన్ని గుర్తు చేసుకుని ఏడ్చింది. ఇక ఈ బుల్లితెర రాములమ్మ లైఫ్‌లో ఉన్న ఆ విలన్ ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

గతంలో ‘పటాస్’ షో చేస్తున్న సమయంలో యాంకర్ రవికి, శ్రీముఖికి మధ్య ఏదో రిలేషన్ నడించిందని వార్తలు వచ్చాయి. అప్పట్లో షో కూడా బ్లాక్‌బస్టర్ అయింది. అంతేకాక ప్రదీప్‌తో కూడా కొన్ని షోస్‌కు యాంకరింగ్ చేసింది శ్రీముఖి. మరి ఈ అందాల భామ చెప్పిన ఆ విలన్ ఎవరో తెలియాల్సి ఉంది.