Sputnik V: గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?

Sputnik V Vaccine: కరోనా వైరస్ మహమ్మారిని నివారించే క్రమంలో వ్యాక్సిన్లు కవచంలా మారాయి. ప్రస్తుతం ఇండియాలో..

Sputnik V: గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?
Sputnik V
Follow us
Ravi Kiran

| Edited By: Phani CH

Updated on: May 14, 2021 | 4:10 PM

Sputnik V Vaccine: కరోనా వైరస్ మహమ్మారిని నివారించే క్రమంలో వ్యాక్సిన్లు కవచంలా మారాయి. ప్రస్తుతం ఇండియాలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉండగా.. ఇటీవల రష్యా దేశం తయారు చేసిన తయారవుతున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు ఇండియాలో అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిని దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేయనుంది.

ఇదిలా ఉంటే డాక్టర్ రెడ్డీస్ తాజాగా స్పుత్నిక్ వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్ ధరను ప్రకటించింది. ఒక్కో డోసుకు రూ. 995.40గా నిర్ణయించింది. ఇందులో 948 రూపాయలు టీకా ధర కాగా, 5 శాతం జీఎస్టీగా నిర్ణయించారు. ఇతర దేశాల్లో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను 10 డాలర్లకు విక్రయిస్తున్నారు. రెండు మోతాదులు వేసుకోవాల్సిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి ఇండియా మార్కెట్‌లో వ్యాక్సినేష‌న్‌కు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.  నేడు కస్టమ్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్ దీపక్ సప్రా స్పుత్నిక్ వి టీకా తీసుకున్నారు. ఆయనకు హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో తొలి డోసు వ్యాక్సిన్ వేశారు.

అయితే దేశీయంగా తయారవుతున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌ టీకా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కొవాగ్జిన్‌ టీకాలను ప్రస్తుతం భారత్‌లో వేస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్ల ధ‌ర కూడా డోసుకు రూ.250 మాత్ర‌మే ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లిస్తుంది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అయితే ఫ్రీగానే ఇస్తున్నారు. అలాంటిది స్పుత్నిక్-వి టీకాకు అధిక ధరను చెల్లించడం పట్ల దేశీయ కంపెనీల స్పందన ఎలా ఉండబోతుందనే అంశం ఆసక్తిగా మారింది.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!