స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకునేవారికి షాక్.. పెరగనున్న ధరలు!
స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా.? ఏదైనా ఆఫర్‌లో తక్కువకు తీసుకుందామని చూస్తున్నారా.? అయితే లేట్ చేయొద్దు! వెంటనే కొనుగోలు చేయండి.
Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా.? ఏదైనా ఆఫర్‌లో తక్కువకు తీసుకుందామని చూస్తున్నారా.? అయితే లేట్ చేయొద్దు! వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే త్వరలోనే యాపిల్, శాంసంగ్, షియోమి, ఒపో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్ ప్యానెళ్లపై తాజాగా కేంద్ర ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనితో స్మార్ట్ ఫోన్ల ధరలు 2 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే పండగ సీజన్ మొదలు కానుండటంతో.. ధరలు పెరిగితే నష్టం వచ్చే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read:
గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!