రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!

ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్, నవంబర్ పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 200 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమవుతోంది.

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!
Follow us

|

Updated on: Oct 02, 2020 | 5:40 PM

Railways to introduce 200 special trains: ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్, నవంబర్ పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 200 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే జోన్ల వారీగా ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని.. ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను రివ్యూ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ వెల్లడించారు.

Also Read: గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్యకాలంలో సుమారు 200 ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ తిప్పనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల బట్టి రోజూవారీగా పాసింజర్ సర్వీసులను సైతం పునరుద్దరించాలని నిర్ణయించింది. ప్రతీరోజూ కరోనా తీవ్రతను పరిశీలిస్తూ ప్రయాణీకుల రద్దీ, హై-డిమాండ్ ఉన్న చోట్ల ట్రైన్స్ తిప్పనుంది. కాగా, ప్రస్తుతం క్లోన్ ట్రైన్స్ 60 శాతం ఫుల్ అవుతున్నాయని వి.కె.యాదవ్ చెప్పుకొచ్చారు.

Also Read: సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..