Indian Railways: భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా..? అది ఏ రాష్ట్రమంటే..
నేడు రైల్వేలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అనేక ఆధునిక సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. కొత్త రైల్వేలు కూడా ప్రారంభించబడ్డాయి. భారతదేశంలో రైల్వే లైన్ల మొత్తం పొడవు 1 లక్ష 15 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ. కానీ, దేశంలో ఇంత పెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, రైల్వే సేవలు చేరుకోని రాష్ట్రం ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా...? కానీ, నిజంగానే దేశంలో రైల్వేలు చేరుకోని ఏకైక రాష్ట్రం ఒకటి ఉంది. అది ఎక్కడో పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి రైలులో ప్రయాణిస్తారు. ప్రజల సౌకర్యార్థం, రవాణా, సరుకుల తరలింపు కోసం రైల్వేలు దేశంలోని ప్రతి మూలకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైలులో ప్రయాణించవచ్చు. అంతేకాదు.. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా, అందరికీ అందుబాటు ధరలతో చౌకగా ఉంటుంది. అందువల్ల, ఎక్కువ మంది ప్రయాణాల కోసం రైల్వేలను ఎంచుకుంటారు. ఇకపోతే, నేడు రైల్వేలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అనేక ఆధునిక సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. కొత్త రైల్వేలు కూడా ప్రారంభించబడ్డాయి. భారతదేశంలో రైల్వే లైన్ల మొత్తం పొడవు 1 లక్ష 15 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ. కానీ, దేశంలో ఇంత పెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, రైల్వే సేవలు చేరుకోని రాష్ట్రం ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా…? కానీ, నిజంగానే దేశంలో రైల్వేలు చేరుకోని ఏకైక రాష్ట్రం ఒకటి ఉంది.
అనేక రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో రైళ్లు ఆగుతాయి. ఎన్నో చిన్న రైల్వే స్టేషన్లు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. దేశంలో మొత్తం 7,300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రతిరోజూ 13,000 నుండి 14,000 ప్యాసింజర్ రైళ్లు, 9,000 సరుకు రవాణా రైళ్లు నడుస్తాయి. అంటే, ప్రతిరోజూ దాదాపు 20,000 రైళ్లు నడుస్తాయి. ఇవి 7,300 స్టేషన్లను కవర్ చేస్తాయి. అంతే కాదు, భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 24 మిలియన్ల మంది రైలులో ప్రయాణిస్తారు. ఇంత పెద్ద పరిధి ఉన్నప్పటికీ, దేశంలో రైల్వే అస్సలు చేరుకోని ఒక రాష్ట్రం ఉంది.
దేశంలో రైల్వే లేని, రైల్వే లైన్ లేని రాష్ట్రం సిక్కిం. ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్ చేరుకోని ఏకైక రాష్ట్రం ఇదే. కానీ, సిక్కిం రైల్వే లైన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. సివోక్-రాంగ్పో రైల్వే ప్రాజెక్ట్ ఇక్కడి ప్రధాన ప్రాజెక్ట్. దీని ద్వారా సిక్కిం మొదటిసారిగా భారతదేశ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 44.96 కి.మీ. పొడవు ఉంది.
ఈ రైలు ప్రాజెక్టు ఇప్పుడు మరింత సవాలుతో కూడిన భూభాగం గుండా నిర్మించబడుతోంది. అనేక సొరంగాలు, వంతెనలు, ఇంజనీరింగ్ పనులు అవసరం. ఈ ప్రాజెక్టు లక్ష్యం రంగ్పోను సిక్కింలో మొదటి రైల్వే స్టేషన్‌గా మార్చడం. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఏడాది కాలం అంటే.. సుమారుగా 2027 నాటికి అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అప్పుడు మాత్రమే సిక్కింలో రైలు సేవలు వాస్తవానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




