Viral Video: ఇన్‌స్టామార్ట్ యూనీఫాంతో ఇంటింటికీ.. డెలివరీ బాయ్‌గా మారిన ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా?
ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారు. వైట్ అండ్ వైట్ ఖద్దర్ డ్రెస్ వేసి.. పెద్ద పెద్ద కార్లలో వెనకాల 10 మంది కార్యకర్తలతో తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడో ఎమ్మెల్యే మాత్రం.. వీటన్నింటిని పక్కనపెట్టి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సాధారణ పౌరుడి అవతారం ఎత్తారు. డెలివరీ బాయ్‌గా మారి.. ఇంటింటికీ తిరిగి ఆర్డర్స్ సప్లయ్ చేశారు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకుందాం పదండి.

టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన డెలివరీ బాయ్‌గా మారి. స్వయంగా ఇంటింటికి ఆర్డర్లను అందించారు. సాధారణ ప్రజల మాదిరిగానే యాప్ ద్వారా వచ్చిన ఫుడ్ ఆర్డర్స్, ఇతర వస్తువులను తీసుకొని కొన్ని ఇళ్లకు వెళ్లి డెలివరీ చేశారు. ఆర్డర్ తీసుకొచ్చిన ఎమ్మెల్యేను చూసిన ఇంటి యజమానులు షాకయ్యారు.
డెలివరీ సిబ్బంది రోజు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. ఎండనకా, వాననకా, ట్రాఫిక్ సమయ ఒత్తిడి వంటి పరిస్థితుల్లోనూ పనిచేసే డెలివరీ బాయ్స్ కష్టాలు ఆ అనుభూతితో తమకు స్పష్టంగా అర్థం అయ్యాయని చెప్పారు. వారి సేవలను సమాజం గౌరవించాలని ఆయన కోరారు..
కొద్దిరోజులుగా కానూరు , పోరంకి , యనమలకుదురు ప్రాంతాల్లో డెలివరీ చేస్తూ కనిపించిన పెనమలూరు ఎమ్మెల్యేను చూసి ఆర్డర్లు తీసుకున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అనుభూతి ద్వారా డెలివరీ సిబ్బందికి మరింత భద్రత మెరుగైన సౌకర్యాలు అవసరమన్న విషయాన్ని గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు..
మరోవైపు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కానూరుకు చెందిన సాయని బసవేశ్వర రావుకు క్యాటరింగ్‌తో నడిచే ట్రై సైకిల్లు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అందించారు. శారీరక అంగవైకల్యం, అనారోగ్య కారణాలతో జీవనోపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసాని ఇచ్చారు.. అంగవైకల్యం శాతాన్ని బట్టి నెలకు రూ.6 నుంచి 15వేల రూపాయలు వరకు పింఛన్ అందజేస్తూ ఆర్థిక భరోసా ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
