ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్! ఈ టిప్స్ తప్పక ట్రై చేయండి..
మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు భాగంగా మారిపోయాయి. పొద్దున లేచింది మొదలు..రాత్రి పడుకునే వరుకు ఎన్నో రకాల పనులకు ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నాం. అయితే.. ఈ ప్లాస్టిక్ బక్కెట్లు, మగ్గులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పడితే మాత్రం క్లీన్ చేయటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువ కష్టపడకుండా ఉండేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని పాటిస్తే.. మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు.

బాత్రూమ్ బాత్ టబ్ లు, బక్కెట్లు, మగ్‌లు వంటివి కొన్ని రోజుల్లోనే మబ్బుగా, జిగటగా మారి వాటిపై తెల్లటి పొర ఏర్పడుతుంది. ముఖ్యంగా నీటిలోని లవణాలు, సబ్బు మలినాలు, షాంపూ, గట్టి నీటి కారణంగా, బాత్ టబ్ లోపల తెల్లటి పదార్థం పేరుకుపోతుంది. ఈ పొర చూడటానికి మురికిగా ఉండటమే కాకుండా, చేతులకు కూడా అంటుకుంటుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, ఇంట్లో లభించే తెల్లటి పదార్థం అయిన బేకింగ్ సోడాను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.
బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, అక్కడ ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజూ ఉపయోగించే బాత్ బకెట్ శుభ్రత విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. బయటి నుండి మెరుస్తూ, శుభ్రంగా కనిపించే బకెట్ లోపలి భాగంలో మబ్బుగా, జిగట, తెల్లటి పొర ఏర్పడి ఉంటుంది. ఈ సమస్య ముఖ్యంగా ప్లాస్టిక్ బకెట్లలో సర్వసాధారణం. ఎందుకంటే నీటిలోని సబ్బు, షాంపూ, లవణాలు ప్లాస్టిక్ ఉపరితలంపై సులభంగా అంటుకుంటాయి.
నీరు, ప్రతిరోజూ ఉపయోగించే సబ్బు, షాంపూ కారణంగా నిరంతరం తేమ కారణంగా ఈ తెల్లటి, జిగట పొర క్రమంగా గట్టిగా మారుతుంది. ఇది మురికిగా కనిపించడమే కాకుండా, తాకినప్పుడు జారేలా అనిపిస్తుంది. అటువంటి బకెట్‌లో పేరుకుపోయిన నీరు చర్మ అలెర్జీలు, దురద, ఫంగస్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. కానీ, మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటించటం ద్వారా మీ ఇంట్లోని ప్లాస్టిక్ వస్తువులను మెరిసేలా చేసుకోవచ్చు…
బకెట్ పై పేరుకుపోయే ఈ తెల్లటి పొర వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. నీటిలో కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటే తెల్లటి పొర ఏర్పడుతుంది. సబ్బు, షాంపూ వంటివి స్నానం చేసిన తర్వాత వాటి అవశేషాలు బకెట్ లోనే ఉంటాయి. తేమ, వెంటిలేషన్ లేకపోవడం వల్ల జిగట పెరుగుతుంది. క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ పొర మరింత గట్టిగా మారుతుంది. ఈ పొర మురికిగా కనిపించడమే కాకుండా, బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు కూడా అవకాశం ఉంది.
ఇలాంటి వస్తువులను శుభ్రం చేయడానికి, వంట గదిలో బేకింగ్ సోడా ఒక సూపర్ ఆయుధంగా పనిచేస్తుంది. ఇది బేకింగ్‌కు మాత్రమే కాకుండా శుభ్రపరచడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. బేకింగ్ సోడా సహజమైనది. రసాయన రహితమైనది. జిగట, తెల్లటి పొరను సులభంగా తొలగిస్తుంది. దుర్వాసనలను తొలగిస్తుంది. ప్లాస్టిక్‌కు హాని కలిగించదు. క్రిమిసంహారక లక్షణాలు కలిగి ఉంటుంది.
శుభ్రపరిచే విధానం..ముందుగా 2 నుండి 3 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా తీసుకోవాలి. అలాగే, వేడి నీరు కూడా. స్క్రబ్ లేదా పాత బ్రష్ కూడా తీసుకోండి. ఇప్పుడు బకెట్ ఖాళీ చేసి వేడి నీటితో నింపండి. దానికి బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్ లేదా బ్రష్‌తో లోపలి భాగాన్ని స్క్రబ్ చేయండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి.
మరొక మార్గంలో బేకింగ్ సోడా, వెనిగర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, అర కప్పు వెనిగర్ తీసుకుని ఒక బకెట్ లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా దానిపై వెనిగర్ పోయాలి. నురుగు వచ్చేలా చేసి 15-20 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు బాగా స్క్రబ్ చేయండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడా, నిమ్మకాయ కూడా ప్లాస్టిక్‌ని క్లీన్ చేయటానికి సూపర్‌గా ఉపయోగపడుతుంది. వంట సోడా, సగం నిమ్మకాయ ఉంటే, నిమ్మకాయకు బేకింగ్ సోడా రాయండి. ఆ నిమ్మకాయతో బకెట్ లోపలి భాగాన్ని రుద్దండి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది బకెట్‌ను శుభ్రం చేయడమే కాకుండా, దానికి తాజా సువాసనను కూడా ఇస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




