AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టిప్ తెలిసాక జ్యువెలరీ షాప్‌కు వెళ్లాల్సిన పని లేదు! వెండిని మెరిపించే ఈజీ ట్రిక్..!

మీ ఇంట్లోని వెండి వస్తువులు మెరవాలంటే..ఖరీదైన పాలిష్‌లు, రసాయనాలు వద్దు..ఇంట్లోనే సరళమైన పరిష్కారాలతో వెండిని శుభ్రం చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఇంట్లోనే వెండిని శుభ్రం చేయడానికి ప్రభావవంతమైన, సురక్షితమైన, చౌకైన మార్గాల గురించి తెలుసుకుందాం..ఈ టిప్స్‌ పాటించటం వల్ల కేవలం 15-20 నిమిషాల్లో వెండిని మళ్ళీ కొత్తగా మెరిసేలా చేసుకోవచ్చు.

ఈ టిప్ తెలిసాక జ్యువెలరీ షాప్‌కు వెళ్లాల్సిన పని లేదు! వెండిని మెరిపించే ఈజీ ట్రిక్..!
Clean Silver
Jyothi Gadda
|

Updated on: Jan 21, 2026 | 12:19 PM

Share

బంగారం, వెండిని ఆభరణాలుగా మాత్రమే కాదు.. సంపదకు చిహ్నంగా, ఇంటికి శ్రేయస్సుగా భావిస్తారు. అందుకే చాలా మంది తమ ఇంట్లోకి వెండి పాత్రలు, వెండి గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు, పూజాసామాగ్రి, నగలు వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, కాలం గడిచేకొద్దీ ఈ వెండి నల్లగా, మురికిగా, బొగ్గులా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు దానిని ఎంత రుద్దినా తిరిగి మెరుపు రాకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఖరీదైన పాలిష్‌లు, రసాయనాలను ఉపయోగించే బదులు, ఇంట్లోనే సరళమైన పరిష్కారాలతో వెండిని శుభ్రం చేయవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈరోజు మనం ఇంట్లోనే వెండిని శుభ్రం చేయడానికి ప్రభావవంతమైన, సురక్షితమైన, చౌకైన మార్గాల గురించి తెలుసుకుందాం..ఈ టిప్స్‌ పాటించటం వల్ల కేవలం 15-20 నిమిషాల్లో వెండిని మళ్ళీ కొత్తగా మెరిసేలా చేసుకోవచ్చు.

మీరు కూడా మీ ఇంట్లోని వెండి వస్తువులు నల్లగా మారితే వెంటనే పాలిష్ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారా..? అయితే, ఆ వృద్ధా ఖర్చు మిగిలినట్టే..ఎందుకంటే.. కొన్ని సింపుల్‌ హోం రెమిడిస్‌తో కేవలం 20 నిమిషాల్లో మీ వెండిని దాని కొత్త మెరుపుకు తీసుకురావొచ్చు. సరైన పద్ధతులు, కొంచెం జాగ్రత్తతో మీ వెండి వస్తువులు, ఆభరణాలు, పూజా సామాగ్రి చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా గాలిలోని సల్ఫర్‌తో చర్య జరిపినప్పుడు వెండి నల్లగా మారుతుంది. తేమతో కూడిన వాతావరణాలు, వంటగది పొగలు, చెమట, పర్‌ఫ్యూమ్స్‌ , సబ్బులు, సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల వెండి త్వరగా నల్లబడుతుంది. అలాంటప్పుడు మజ్జిగతో మీరు వెండికి తిరిగి మెరుపు తీసుకురావొచ్చు.

వెండి మెరవాలంటే మజ్జిగ లేదంటే, పుల్లని పెరుగు ఉంటే సరిపోతుంది. వెండిని పుల్లని మజ్జిగలో 20–30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీటితో శుభ్రం చేసి మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. దీంతో మీ సిల్వర్‌ తిరిగి మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

వెండిని శుభ్రం చేయడానికి మరో మార్గం నిమ్మకాయ, ఉప్పు. మీరు రసాయనాలను ఉపయోగించకుండా వెండిని శుభ్రం చేయాలనుకుంటే ఈ పరిష్కారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక నిమ్మకాయ రసం తీసి అందులో చిటికెడు ఉప్పు కలపండి. దానిని వెండిపై పూర్తిగా అప్లై చేయాలి. 5–10 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇలా చేస్తే.. వెండికి సహజమైన మెరుపు వస్తుంది.

మూడో పరిష్కారం టూత్‌పేస్ట్‌తో వెండిని శుభ్రం చేయటం. ఈ పరిహారం నల్లగా మారిన వెండి వస్తువులు, ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందుకోసం తెల్లటి టూత్‌పేస్ట్ తీసుకోండి. మృదువైన బ్రష్ లేదా గుడ్డతో వెండిపై సున్నితంగా రుద్దండి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసి మెత్తటి క్లాత్‌తో తుడిచేయాలి. ఇలా చేస్తే మీ వెండి మెరుస్తుంది.

బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ కూడా నల్లబడిన వెండికి కొత్త మెరుపును ఇస్తుంది. దీనికోసం అల్యూమినియం ఫాయిల్, బేకింగ్ సోడా, వేడి నీరు, మీ వెండి వస్తువులకు సరిపడా బౌల్‌, లేదంటే టబ్‌ తీసుకోవాలి. ఇప్పుడు, ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ ఉంచండి. దానిపై వెండి వస్తువులను ఉంచండి. ఇప్పుడు 1–2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేయండి. దానిపై వేడి నీరు పోయాలి. 10–15 నిమిషాలు అలాగే ఉంచేసి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, మెత్తని గుడ్డతో తుడవండి. ఇలా చేస్తే.. నల్లగా మారిన మీ వెండి వస్తువులు, పూజా సామాగ్రి తిరిగి కొత్తవాటిలా మెరుస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..