Raj Kundra arrest: ఒకొక్కటిగా బయటకు వస్తున్న రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
బాలీవుడ్‌లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత.. అతని చీకటి వ్యవహారాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మించి వాటిని వివిధ యాప్‌లలో....
బాలీవుడ్‌లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత.. అతని చీకటి వ్యవహారాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మించి వాటిని వివిధ యాప్‌లలో అప్ లోడ్ చేస్తున్నడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలతోనే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే.. తన అరెస్టును ముందే ఊహించిన రాజ్.. అందకుముందే తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో.. బలమైన సాక్ష్యం లభించింది. బ్రిటన్‌లోని తన బందువు ప్రదీప్ బక్షితో కలిసి రాజ్ కుంద్రా ..అశ్లీల చిత్రాల దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సప్ చాటింగ్, ఈ మెయిల్స్ ద్వారా ఈ అశ్లీల చిత్రాల దందా బయటపడింది. ప్రదీప్ బక్షికి బ్రిటన్‌లో ఉన్న కెన్రిన్ అనే నిర్మాణ సంస్థ నుంచి… హాట్ షాట్ అనే యాప్‌ను హ్యాండిల్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకొని.. అశ్లీల చిత్రాలలో నటించేలా బలవంతం చేసి వాటిని చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
ఈ పోర్న్ వీడియోలను బ్రిటన్‌లోని హాట్ షాట్ యాప్‌తో పాటు.. మరి కొన్ని యాప్‌లలో అప్లోడ్ చేసున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పోర్న్ వీడియోలను చూసేందుకు సబ్ స్క్రైబర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంత మంది ఏజెంట్లు ద్వారా పోర్న్ చిత్రాల నిర్మాణానికి కెన్రిన్ నిధులు సమకూర్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. పోర్న్ చిత్రాల్లో నటించిన వారికి పారితోషకాలు ఇచ్చేందుకు.. రాజ్ కుంద్రా H అకౌంట్ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్ట్‌తో ఈ అశ్లీల రాకెట్ గుట్టు రట్టయింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన ముంబై క్రైమ్ పోలీసులు.. 7.5 కోట్లు సీజ్ చేశారు. ఇక రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.
మరోవైపు.. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గతంలో చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తొమ్మిదేళ్ల క్రితమే ఆయన పోర్నోగ్రఫీ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు. పోర్న్ చూడటం తప్పేం కాదని అభిప్రాయపడ్డాడు. “పోర్న్ వర్సెస్ వ్యభిచారం.. కెమెరా ముందు డబ్బులిచ్చి చేయించేది చట్టబద్ధం అయినప్పుడు మిగతాది మాత్రం ఎందుకు లీగల్ కాదు?” అని ప్రశ్నించాడు. 2012 మార్చి 29న ఈ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు. రాజ్ కుంద్రాకు మద్దతుగా కొందరు బయటికొస్తున్నారు. ఆయన తీసింది నీలి చిత్రాలు కాదని.. సాఫ్ట్ పోర్న్ అంటోంది నటి గెహనా. కుంద్రాను అన్యాయంగా అరెస్ట్ చేశారంటోంది.
రాజ్ కుంద్రా అరెస్టుపై హర్షం వ్యక్తం చేసిన ఆమె న్యాయవ్యవస్థ పై తనకు నమ్మకం ఉందని, ఈసారి న్యాయమే గెలిచి తీరుతుందని వ్యాఖ్యానించారు. అలానే.. పూనమ్ పాండే.. శిల్పాశెట్టి గురించి కామెంట్ చేసింది. ఆమె పరిస్థితి మరెవరికీ రాకూడదని.. శిల్పా పిల్లలను తలుచుకుంటే బాధేస్తోందని సానుభూతి వ్యక్తం చేసింది పూనమ్. మరోవైపు.. పోర్నోగ్రఫీ గురించి భారత చట్టాలు ఏం చెబుతున్నాయి? అశ్లీల వీడియోలు తీయడం, చూడటం చట్ట ప్రకారం నేరమా..? రాజ్ కుంద్రా నేరం నిరూపితమైతే ఎన్నేళ్ల శిక్ష పడతుందనే.. విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి. ఇండియాలో పోర్నోగ్రఫీకి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్‌లో.. మూడు సెక్షన్లు ఉన్నాయి. 292, 293, 294… అంతేకాకుండా.. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 67ఎ కూడా అశ్లీల చిత్రాలకు సంబంధించినదే…! అయితే ఈ చట్టం ప్రకారం ఇండియాలో పోర్న్ లేదా అశ్లీల కంటెంట్‌ను చూడటం, చదవడం నేరం కాదు. 2015 జులైలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో నాలుగు గోడల మధ్య పోర్న్ చూడటం అనేది చట్టబద్ధమే..! ఇది నేరం కింద పరిగణించకూడదు. కానీ ఆ వీడియోలను తీయడం, ప్రచారం చేయడం, పంపిణీ చేయడం మాత్రం నేరంగా పరిగణిస్తారు.
సెక్షన్ 292 అనేది అశ్లీలం అంటే ఏంటో వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వీటిని చేయడం, పంపిణీ చేయడం నేరంగా పరిగణిస్తూ… తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష, రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇక సెక్షన్ 293 అనేది… ఇలాంటి అశ్లీల వీడియోలు తీయడం… వాటిని 20 ఏళ్లలోపు యువతకు పంపిణీ చేయడానికి సంబంధించినది. ఇక సెక్షన్ 294 అనేది పబ్లిగ్గా తమ చర్యలు, పాటల ద్వారా అశ్లీలాన్ని ప్రదర్శించడం గురించి చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల పాటలు పాడటం, ఉచ్ఛరించడం అనేది నేరంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం రాజ్‌కుంద్రాపై ఈ మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఒక వేళ ఇందులో మహిళలు, చిన్న పిల్లలు కనుక ఉంటే వేరే సెక్షన్ల కింద కూడా కేసులు నమోదవుతాయి. పిల్లల విషయంలో పోక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పోర్నోగ్రఫీలో పిల్లలను భాగం చేయడం నేరం… ఇక మహిళల విషయంలో ఇన్‌డీసెంట్ రిప్రజెంటేషన్ ఆప్ విమెన్ -ప్రొహిబిషన్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. రాజ్‌కుంద్రాపై ఈ చట్టంలోని సెక్షన్ 3, 4, 6, 7 కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇక పోర్నోగ్రఫీ విషయంలో.. ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఎను కూడా ప్రయోగిస్తారు. అశ్లీల కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేయడం, షేర్ చేయడం అనేది ఈ సెక్షన్ కింద నేరం. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 10 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. రెండోసారి నేరం చేస్తే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
Also Read: 21 సంవత్సరాల తర్వాత అతడికి షాకింగ్ నిజం తెలిసింది.. ఆమె తన సోదరి కాదు తల్లి అని