Constable Suicide : మియాపూర్ నడిగడ్డ తండా క్యాంపులో కలకలం.. పిస్టల్ తో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్..!
హైదరాబాద్ మియాపూర్ నడిగడ్డ తండా దగ్గరున్న సీఆర్పీఎఫ్ క్యాంపులో ఈ సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్..
CRPF Constable Suicide : హైదరాబాద్ మియాపూర్ నడిగడ్డ తండా దగ్గరున్న సీఆర్పీఎఫ్ క్యాంపులో ఈ సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీని పాయింట్ బ్లాంక్ లో పెట్టుకొని తలలోకి కాల్చుకొని అతి దారుణంగా ప్రాణం తీసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే కానిస్టేబుల్ తుపాకీ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. 2017 బ్యాచ్ కు చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఠాగూర్ శంకర్ కొన్ని రోజులుగా మియాపూర్ సిఆర్పిఎఫ్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే, ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాల సమయంలో పెద్దగా వెపన్ పేలినట్టు శబ్దం రావడంతో పక్కనే ఉన్నవారు వెళ్లి చూసారు. శంకర్ తన వెపన్ తో గొంతు కింది నుండి కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాట్టు గుర్తించారు. గత కొద్ది రోజుల నుండి తన భార్యతో ఠాగూర్ కు గొడవ జరుగుతున్నట్టు తోటి సిబ్బంది చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
శంకర్ వెపన్ ను సీజ్ చేశామని తెలిపిన పోలీసులు, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించామని.. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని వెల్లడించారు. “ఇప్పుడున్న సమాచారం ప్రకారం సూసైడ్ అని భావిస్తున్నాం.. ఇంకేమైనా కారణాలు ఉంటే విచారణలో తెలుస్తోంది. ఠాగూర్ గత మూడు నెలల నుంచి ఈ క్యాంప్ లో విధులు నిర్వహిస్తున్నట్లు చెపుతున్నారు. ఈరోజు ఉదయం అందరితో సరదాగానే ఉన్నాడని ఆయనతో పాటు ఉన్న సిబ్బంది చెబుతున్నారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాము.” అని పోలీసులు వెల్లడించారు.