ఏపీ హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు..
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమ ఆయుధాల కొనుగోలు ఆరోపణలతో ఏసీబీ.. ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసింది.

Senior IPS Officer AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమ ఆయుధాల కొనుగోలు ఆరోపణలతో ఏసీబీ.. ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏబీ పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలన్న హైకోర్టు.. దాని కింద కేసు నమోదు చేయకుంటే కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఏబీకి తెలిపింది.
Also Read:
మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!
ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..