హెలికాప్టర్‌-ధ్రువ తయారీలో హెచ్‌ఏఎల్‌ మైలురాయి

ఆత్మ నిర్భర భారత్ పిలుపుతో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న యుద్ధ విమానాలకు అధిక ప్రాధాన్యత నిస్తోంది.

హెలికాప్టర్‌-ధ్రువ తయారీలో హెచ్‌ఏఎల్‌ మైలురాయి
Follow us

|

Updated on: Sep 30, 2020 | 5:38 PM

ఆత్మ నిర్భర భారత్ పిలుపుతో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న యుద్ధ విమానాలకు అధిక ప్రాధాన్యత నిస్తోంది.. తాజాగా హెచ్‌ఏఎల్‌ (హిందుస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌) సైనిక అవసరాల కోసం అత్యాధునిక, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల (ఏఎల్‌హెచ్‌-అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌- ధ్రువ) తయారీలో 300 మైలురాయిని చేరుకున్నందుకు మంగళవారం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ ప్రధాన కార్యాలయంలో వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఏఎల్‌ సీఎండీ ఆర్‌.మాధవన్‌ 300వ ఏఎల్‌హెచ్‌ తయారీ ధ్రువీకరణ పత్రాన్ని హెలికాప్టర్‌ కాంప్లెక్స్‌ సీఈఓ జీబీఎస్‌ భాస్కర్‌కు అందజేశారు. స్వదేశీ సాంకేతిక, అభివృద్ధి, పరిశోధనల ద్వారా రూపొందిన 73 ఏఎల్‌హెచ్‌లను ఇప్పటికే సైనిక అవసరాలు అందించామన్నారు ఆర్‌.మాధవన్‌. మిగతావి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఏఎల్‌ సిబ్బంది అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు.