ఏపీలో నవశకం.. ఎరువుల పంపిణీలో కొత్త సిస్టమ్

ఏపీలో ఎరువుల పంపిణీకి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇద్దరు కేంద్ర మంత్రులు బుధవారం నాడు ప్రారంభించారు.

ఏపీలో నవశకం.. ఎరువుల పంపిణీలో కొత్త సిస్టమ్
Follow us
Rajesh Sharma

|

Updated on: Sep 30, 2020 | 5:16 PM

New fertilizer distribution system in Andhra Pradesh: ఏపీలో ఎరువుల పంపిణీకి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇద్దరు కేంద్ర మంత్రులు బుధవారం నాడు ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు ఎరువుల పంపిణీని ప్రారంభించారు. రైతులకు కేటాయించిన ఎరువుల సమాచారాన్ని రైతు మొబైల్‌కు ముందుగా ఎస్.ఎం.ఎస్. పంపిస్తారు. ఆ తర్వాత ఎరువులను హోం డెలివరీ చేస్తారు. ఈ విధానంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు రైతుల సకాలంలో ఎరువుల పంపిణీ పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) వెర్షన్, ఎస్.ఎం.ఎస్. సర్వీసును బుధవారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద గౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా కలిసి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జాయినయ్యారు. సీఎం జగన్‌తోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also read:   ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట

Also read:    క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు

Also read:    ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు

Also read:    బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. రేంజ్ తెలిస్తే షాకే!