సెల్ఫీలతో పర్యావరణానికి చేటు ?

రెండోసారి ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టిన మోదీ .. తన కొత్త ప్రభుత్వ హయాంలోనూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంతేకాదు.. పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా చూస్తున్న ప్రకాష్ జవదేకర్.. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కతో సెల్ఫీ తీసుకోవాలని, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ఇది చేయాలని సూచించారు కూడా. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని […]

సెల్ఫీలతో పర్యావరణానికి చేటు ?
Pardhasaradhi Peri

|

Jun 05, 2019 | 4:08 PM

రెండోసారి ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టిన మోదీ .. తన కొత్త ప్రభుత్వ హయాంలోనూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంతేకాదు.. పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా చూస్తున్న ప్రకాష్ జవదేకర్.. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కతో సెల్ఫీ తీసుకోవాలని, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ఇది చేయాలని సూచించారు కూడా. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఎన్విరాన్ మెంట్ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఇది మొదటిసారి కాదు. 2015 లో భేటీ పఢావో, భేటీ బచావో నినాదంలో భాగంగా… ‘ కూతురితో సెల్ఫీ ప్రచారం ‘ చేపడుతున్నట్టు మోదీ నాడు ప్రకటించారు. హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ ఇఛ్చిన స్ఫూర్తి అది. ఈ సారి కూడా ఇలాంటి ప్రయోగాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం, అడవుల నరికివేత వంటివి ఇంకా అపరిష్కృత సమస్యలుగానే మిగిలి ఉండగా సెల్ఫీ ప్రచారం వల్ల కొత్తగా ఒనగూడే ప్రయోజనం ఉంటుందా అని పర్యావరణవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో కూడా పర్యావరణ మంత్రిత్వ శాఖను పర్యవేక్షించిన ప్రకాష్ జవదేకర్.. వాయు, జల కాలుష్యాలకు సంబంధించిన చట్టాలను నీరుగార్చారనే ఆరోపణలకు ఊతమిచ్చారు. వీటిని కొన్ని పార్లమెంటరీ కమిటీలు, గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు కూడా తప్పు పట్టాయి. ప్రముఖ పర్యావరణవేత్తలు సైతం ఈ చట్టాల పట్ల పెదవి విరిచారు. ఢిల్లీ వంటి మహానగరాల్లో రోజూ వాయు కాలుష్యం పెరిగిపోతోందని, రోడ్లు ఈ కాలుష్యంతో నిండిపోతుండగా.. దీనిపై దృష్టి సారించకుండా, సెల్ఫీ ప్రచారాలు చేపట్టడం వల్ల ఉపయోగం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీలు, కోర్టులు చేసిన సూచనలను తమ శాఖ ఇంకా పరిశీలిస్తోందని పర్యావరణ శాఖ అధికారులే అంగీకరించారని వీరు గుర్తు చేశారు. సెల్ఫీ ప్రచార ఆర్భాటం కన్నా గ్లోబల్ హీట్ పై ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఇఛ్చిన, ఇస్తున్న సూచనలు, సలహాలను పాటించాలని, అంతే తప్ప ఉన్న చట్టాలను నీరు గార్చడంవల్ల కలిగే ప్రయోజనం కన్నా కీడే ఎక్కువని వారు పేర్కొంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం బ్రిటన్ వంటి దేశాల్లో పెద్దఎత్తున ప్రజలు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేస్తున్న విషయాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. మొక్కలతో సెల్ఫీ నినాదం పని చేయదన్నది వీరి వాదన.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu