చనిపోయి నాలుగు రోజులైనా.. ఇండియాకి రాని డెడ్‌బాడీ..

న్యూజెర్సీ తెలుగు విద్యార్ధి మృతి ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దేశం కాని దేశంలో కన్నకొడుకు చనిపోయి నాలుగు రోజులవుతున్నా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేక పోతోంది ఆ కుటుంబం. విశాఖకు చెందిన అవినాష్ అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం న్యూజెర్సీలో చనిపోయాడు. విహార యాత్రకు వెళ్లి సరస్సులో దిగిన అవినాష్.. ప్రమాదవశాత్తూ సరస్సులోనే చిక్కుకొని చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగురోజుల క్రితం చనిపోయిన కొడుకు డెడ్‌బాడీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:37 pm, Wed, 5 June 19
చనిపోయి నాలుగు రోజులైనా.. ఇండియాకి రాని డెడ్‌బాడీ..

న్యూజెర్సీ తెలుగు విద్యార్ధి మృతి ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దేశం కాని దేశంలో కన్నకొడుకు చనిపోయి నాలుగు రోజులవుతున్నా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేక పోతోంది ఆ కుటుంబం. విశాఖకు చెందిన అవినాష్ అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం న్యూజెర్సీలో చనిపోయాడు. విహార యాత్రకు వెళ్లి సరస్సులో దిగిన అవినాష్.. ప్రమాదవశాత్తూ సరస్సులోనే చిక్కుకొని చనిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగురోజుల క్రితం చనిపోయిన కొడుకు డెడ్‌బాడీ ఇప్పటి వరకు రాకపోవడంతో ఈ కుటుంబంలో అంతా నిశబ్ధంగా మారింది. అవినాష్ డెడ్‌బాడీ కోసం బంధువులంతా ఎదురు చూస్తున్నారు. అయితే.. డెడ్‌బాడీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని, మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.