గుడిలో దళితుడు.. చితకబాదిన దుండగులు
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పాలిలో పూజారి కూతురిని వేధించడాన్న నెపంతో ఓ దళిత బాలుడిని చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిందపడేసి ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు కొందరు దుండగులు. ఈ దాడిలో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఆలయంలో ఉంటున్న పూజారి.. తన కూతురిని ఈ బాలుడు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో.. అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం […]
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పాలిలో పూజారి కూతురిని వేధించడాన్న నెపంతో ఓ దళిత బాలుడిని చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిందపడేసి ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు కొందరు దుండగులు. ఈ దాడిలో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.
అయితే ఆలయంలో ఉంటున్న పూజారి.. తన కూతురిని ఈ బాలుడు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో.. అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. అయితే దుండగులు ఎవ్వరూ తనను కొట్టలేదని ఆ బాలుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే జూన్ 4న ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిందన్నారు. బాలుడిపై దాడి చేసిన వారిని ఈ వీడియో ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నలుగురు యువకులు ఆ బాలుడిపై దాడి చేశారని.. నిందితులపై ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.