AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి ఇక ఎస్.ఏ.జెడ్…. జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన అమరావతి ప్రాంత రైతాంగం కోసం అద్భుతమైన యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఇరవై ఏళ్ళుగా తెలుగు ప్రజలు వింటూ వస్తున్న స్పెషల్ ఎకానమిక్ జోన్ తరహాలో ’’స్పెషల్ అగ్రికల్చర్ జోన్’’ ఏర్పాటుకు 33 వేల ఎకరాలను వినియోగించాలని జగన్ భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ ఎస్.ఏ.జెడ్.లో భూములను […]

అమరావతి ఇక ఎస్.ఏ.జెడ్.... జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 6:11 PM

Share

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన అమరావతి ప్రాంత రైతాంగం కోసం అద్భుతమైన యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఇరవై ఏళ్ళుగా తెలుగు ప్రజలు వింటూ వస్తున్న స్పెషల్ ఎకానమిక్ జోన్ తరహాలో ’’స్పెషల్ అగ్రికల్చర్ జోన్’’ ఏర్పాటుకు 33 వేల ఎకరాలను వినియోగించాలని జగన్ భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ ఎస్.ఏ.జెడ్.లో భూములను త్యాగం చేసిన రైతులందరినీ భాగస్వామ్యం చేయాలని జగన్ తలపెట్టారు. తద్వారా ఈ ఎస్.ఏ.జెడ్. ద్వారా వచ్చే ఆదాయంలో రైతులందరికీ ప్రయోజనం లభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

జగన్ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్‌లోని ముఖ్యాంశాలను టీవీ9 వెబ్ సైట్ సంపాదించింది. యావత్ దేశానికి ఆదర్శంగా.. అందరూ అనుసరించేలా ఎస్.ఏ.జెడ్.ని రూపొందించేందుకు ఏపీ వ్యవసాయ శాఖ ఆల్‌రెడీ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పుష్కలంగా వున్న కృష్ణమ్మ జలసిరి, సంవత్సరానికి మూడు, నాలుగు పంటల్నిచ్చే సారవంతమైన భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చకుండా.. ఆ నేల తల్లి కడుపులో పంటల సిరి పండించడం ద్వారా వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతోపాటు ఆ ప్రాంత రైతులను దేశానికే ఆదర్శవంతంగా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.

ఎస్.ఏ.జెడ్. ప్రణాళికలోని ముఖ్యాంశాలు:

# అమరావతి ప్రాంతం చారిత్రాత్మకంగాను, సహజంగాను వ్యవసాయానికి అత్యంత యోగ్యమైన భూములున్న ప్రాంతం. # వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాస్త్రవేత్తలు అందుబాటులో వున్న ప్రాంతం అమరావతి. # రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలలో విభిన్నమైన వ్యవసాయ పద్దతులలో భారీ ఎత్తున సాగుబడి. ఉదాహరణకు వర్టికల్ ఫార్మింగ్, హైడ్రోఫోనిక్స్, ఆర్గానిక్ వ్యవసాయం, వాణిజ్యపంటలు, హార్టికల్చర్ పంటలు, ఆయుర్వేద ఉత్పత్తులు, పశు సంవర్ధకం వంటి వాటిని స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌లో ఏర్పాటు. # వ్యవసాయానికి అవసరమైన అన్ని వసతులు, అనుమతులు ఓకే లభ్యమయ్యేలా ఏర్పాట్లు. # ఉత్పత్తుల ఆధారంగా గ్రూపుల విభజన. గ్రూపుల ఆధారంగా వ్యవసాయం. సహకార సంస్థల ద్వారా రైతాంగానికి సాయం. ఇలాంటి సౌకర్యాలన్నీ ఒకే చోట కల్పిస్తారు. # భూములిచ్చిన రైతుల సెంటిమెంటును గౌరవిస్తూ వారికి తగిన భాగస్వామ్యం కల్పించేలా చర్యలు. # పాక్షికంగాను లేదా పూర్తిగాను వ్యవసాయ ఎగుమతులు, సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తుల జోన్‌గా అభివృద్ధి. # ఎస్.ఏ.జడ్. విధానాన్ని ఒక బెంచ్ మార్క్ యావత్ దేశం అనుసరించేలా అమలు. # ఎస్.ఏ.జడ్.లో భూములిచ్చిన రైతులకు తగిన వాటా. # వ్యవసాయ పరిశోధనలకు ఎస్.ఏ.జడ్.లో పెద్దపీట. # హైబ్రీడ్ పరిశోధనలను, ప్రయోగాలను పెద్ద ఎత్తున కొనసాగించేందుకు ఎస్.ఏ.జడ్. ఒక అనువైన ప్రాంతం. # కార్పొరేట్ సంస్థలను ఎస్.ఏ.జడ్.లో భాగస్తులను చేయడం ద్వారా వారి ఉత్పత్తులను, కొత్త టెక్నాలజీని వాడుకలోకి తీసుకురావడం. # ప్రభుత్వ నియంత్రణతో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించడం. # ఏఐ టూల్స్, లాట్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి ఆధునాతన పద్దతుల ప్రదర్శన. # పెద్ద ఎత్తున పెస్ట్ సర్వైలెన్స్, వెదర్ ఫోర్ కాస్టింగ్ పద్దతుల అమలు. # చక్కని వ్యవసాయ పద్దతులు, ఇరిగేషన్ సిస్టమ్స్, ఫాం మెకనైజేషన్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ అమలు. # అమరావతి ఎస్.ఏ.జడ్. విధానం ఆధారంగా రాష్ట్రంలో మరిన్ని ఎస్.ఏ.జడ్.ల ఏర్పాటు. # వ్యవసాయ కూలీల హక్కులకు, వారి జీవితాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు. # ఎస్.ఏ.జడ్.లో సుశిక్షిత, నైపుణ్యం కలిగిన, తక్కువ నైపుణ్యం కలిగిన వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పన. # వ్యవసాయాధారిత వ్యాపారాల అభివృద్ధి. # వినియోగదారుల సంతృప్తి, సామాన్యల సంతోషం ఆధారంగా ఫలితాల విశ్లేషణ. # వ్యవసాయం చేయాలనుకునే యువకులకు తగిన గౌరవం దక్కేలా చర్యలు. # వ్యవసాయ, ఆహారోత్పత్తుల రంగంలో భవిష్యత్ సవాళ్ళను అధిగమించేలా చర్యలు. # అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ రంగానికే ఆదర్శంగా తీర్చి దిద్దడం. # ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టేనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ చేరుకునేలా ప్రణాళిక.