AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీ-దేవరకొండ ప్రాజెక్ట్‌కు ‘కాస్టింగ్’ కష్టాలు..?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఫైటర్ అనే టైటిల్‌ను ఫైనల్ చేయాలని భావిస్తుండగా.. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీని ఈ నెల చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘కాస్టింగ్’ కష్టాలు కొనసాగుతున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఈ మూవీ […]

పూరీ-దేవరకొండ ప్రాజెక్ట్‌కు 'కాస్టింగ్' కష్టాలు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 5:36 PM

Share

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఫైటర్ అనే టైటిల్‌ను ఫైనల్ చేయాలని భావిస్తుండగా.. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీని ఈ నెల చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘కాస్టింగ్’ కష్టాలు కొనసాగుతున్నట్లు ఫిలింనగర్ టాక్.

అయితే ఈ మూవీ కోసం హీరోయిన్‌గా శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్‌ను సంప్రదించారు పూరీ జగన్నాథ్. కథను విన్న జాన్వీ.. ఇందులో నటించేందుకు ఓకే చెప్పిందట. అందునా విజయ్ దేవరకొండపై క్రష్ కలిగిన ఈ భామ.. అతడితో జత కట్టేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కానీ ఇప్పుడు ఆమె డైరీ ఫుల్‌గా ఉంది. గుంజనా సక్సేనా, రూహీ అఫ్జా, దోస్తానా 2 చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామా తక్త్‌లో జాన్వీ నటించబోతోంది. వీటిలో తక్త్ మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో ఫైటర్ మూవీపై జాన్వీ ఇంకా డైలమాలో ఉందట. దీంతో ఇంకా డేట్లను ఇవ్వలేదని తెలుస్తోంది.

మరోవైపు ఇందులో విజయ్ దేవరకొండకు గురువుగా రియల్ లైఫ్ బాక్సర్‌ను తీసుకోవాలనుకుంటున్నాడట పూరీ. ఈ క్రమంలో ఆయన పలువురితో సంప్రదింపులు జరుపుతున్నా.. ఇంకా ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదట. ఇలా కాస్టింగ్ కష్టాలతో పూరీ కాస్త డైలమాలో ఉన్నారట. కాగా మల్టీలింగ్వువల్‌ చిత్రంగా ఫైటర్ తెరకెక్కబోతుండగా.. ఈ మూవీ నిర్మాణంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా పాలుపంచుకోనున్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు