హైదరాబాద్ లో సీఏఏకు వ్యతిరేకంగా 4 న ‘ మిలియన్ మార్చ్ ‘
సవరించిన పౌరసత్వ చట్టానికి, ఎన్నార్సీకి నిరసనగా ఈ నెల 4 న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ‘ మిలియన్ మార్చ్ ‘ నిర్వహించాలని వివిధ ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ నిర్ణయించింది. సుమారు పది లక్షలమందితో ఇలాంటి ప్రదర్శనను డిసెంబరు 28 న జరపాలని తీర్మానించినప్పటికీ.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు అనుమతించే విషయాన్ని మళ్ళీ పరిశీలించవలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించిందని జేఏసీ […]
సవరించిన పౌరసత్వ చట్టానికి, ఎన్నార్సీకి నిరసనగా ఈ నెల 4 న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ‘ మిలియన్ మార్చ్ ‘ నిర్వహించాలని వివిధ ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ నిర్ణయించింది. సుమారు పది లక్షలమందితో ఇలాంటి ప్రదర్శనను డిసెంబరు 28 న జరపాలని తీర్మానించినప్పటికీ.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు అనుమతించే విషయాన్ని మళ్ళీ పరిశీలించవలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించిందని జేఏసీ కన్వీనర్ ముష్తాక్ మాలిక్ తెలిపారు. ఈ భారీ ప్రదర్శనలో దళిత సంఘాలతో సహా విద్యార్ధిసంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొంటాయని, వివిధ జిల్లాల నుంచి సైతం ప్రజలు రానున్నారని ఆయన చెప్పారు.
అయితే సీఏఎకు నిరసనగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం కూడా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు నగర సీపీ అనుమతిని కోరింది. చార్మినార్ నుంచి ధర్నా చౌక్ వరకు ఒక మార్గంలోనూ, దారుస్సలాం నుంచి ఈద్ గా బిలాలి వరకు మరో మార్గంలోనూ మార్చ్ నిర్వహిస్తామని అంటూ… మరో మార్గాన్ని కూడా తాము పోలీసులకు సూచించినట్టు ఒవైసీ ట్వీట్ చేశారు
కాగా.. ఈనెల 4 లేదా 5 తేదీల్లో మార్చ్ ను నిర్వహించాలన్నది ఈ పార్టీ యోచన. ఇందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ తాను నగర పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు సమర్పించానని ఆయన తెలిపారు. ఈ నెల 4 న ఎంఐఎంకు పోలీసులు అనుమతి నిచ్చిన పక్షంలో అది ‘ మిలియన్ మార్చ్ ‘ ను ‘ ఢీ ‘ కొనే అవకాశం ఉంది. ఒవైసీ ట్వీట్ చూసిన నెటిజన్లు కొందరు ఎంఐఎం ర్యాలీని జనవరి 5 కు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.