నేడు భారత్ రానున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్.. రేపు ప్ర‌ధాని మోదీతో భేటీ

నేడు భారత్ రానున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్.. రేపు ప్ర‌ధాని మోదీతో భేటీ

సౌదీ అరేబియా రాజు మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌.. ఇవాళ ఇండియాకు రానున్నారు. సోమ‌వార‌మే ఇస్లామాబాద్ చేరుకున్న ప్రిన్స్‌.. అక్క‌డ ఇవాళ కూడా కొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొనున్నారు. అనంతరం భారత్ కు బయలుదేరనున్నారు. రేపు ఉదయం ప్ర‌ధాని మోదీతో ప్రిన్స్ స‌ల్మాన్ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉగ్ర‌వాదంపై పోరును ఉదృతం చేసేందుకు ప్రిన్స్ స‌ల్మాన్‌పై భార‌త్ ఒత్తిడి తీసుకురానున్న‌ది. పుల్వామా దాడి ఘ‌ట‌న గురించి కూడా ప్రిన్స్ స‌ల్మాన్‌కు భార‌త్ వివ‌రించ‌నున్న‌ది. మ‌రోవైపు సోమ‌వారం ప్రిన్స్ స‌ల్మాన్‌ను పాకిస్థాన్ అత్యున్న‌త […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:30 PM

సౌదీ అరేబియా రాజు మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌.. ఇవాళ ఇండియాకు రానున్నారు. సోమ‌వార‌మే ఇస్లామాబాద్ చేరుకున్న ప్రిన్స్‌.. అక్క‌డ ఇవాళ కూడా కొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొనున్నారు. అనంతరం భారత్ కు బయలుదేరనున్నారు. రేపు ఉదయం ప్ర‌ధాని మోదీతో ప్రిన్స్ స‌ల్మాన్ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉగ్ర‌వాదంపై పోరును ఉదృతం చేసేందుకు ప్రిన్స్ స‌ల్మాన్‌పై భార‌త్ ఒత్తిడి తీసుకురానున్న‌ది. పుల్వామా దాడి ఘ‌ట‌న గురించి కూడా ప్రిన్స్ స‌ల్మాన్‌కు భార‌త్ వివ‌రించ‌నున్న‌ది. మ‌రోవైపు సోమ‌వారం ప్రిన్స్ స‌ల్మాన్‌ను పాకిస్థాన్ అత్యున్న‌త పౌర స‌త్కారంతో స‌న్మానించింది. ఆ త‌ర్వాత ప్ర‌క‌ట‌న చేసిన స‌ల్మాన్‌.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కొనియాడారు. భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు ఇమ్రాన్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్రిన్స్ స‌ల్మాన్ అన్నారు. అయితే ఉగ్ర‌వాదంపై భార‌త్‌, సౌదీలు బుధ‌వారం సంయుక్త ప్ర‌క‌ట‌న చేయనున్నాయి. వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని పెంపొందించే దిశ‌గా రెండు దేశాలు ప్ర‌య‌త్నాలు చేప‌ట్ట‌నున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu