‘సూసైడ్ ఆర్ మర్డర్’.. సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల..
Sushant Singh Rajput Biopic: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన జీవితంపై బయోపిక్‌ను ‘సూసైడ్ ఆర్ మర్డర్’ అనే పేరుతో తీయనున్నట్లు ప్రముఖ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డూప్ అయిన సచిన్ తివారీ నటిస్తున్నాడు. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన సుశాంత్ ఎలా స్టార్ […]

Sushant Singh Rajput Biopic: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన జీవితంపై బయోపిక్‌ను ‘సూసైడ్ ఆర్ మర్డర్’ అనే పేరుతో తీయనున్నట్లు ప్రముఖ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డూప్ అయిన సచిన్ తివారీ నటిస్తున్నాడు.
ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన సుశాంత్ ఎలా స్టార్ హీరోగా ఎదిగాడు అనేది చిత్ర కథాంశం. అసలు సుశాంత్ బాలీవుడ్‌కు ఎలా పరిచయమయ్యాడు.? ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి.? అనే పలు కీలక అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ నెపోటిజంపై వ్యంగ్యంగా విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ముంబై, పంజాబ్, బీహార్ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కాగా, సుశాంత్ మరణంతో సంబంధం ఉన్నవారి పాత్రలు ఇందులో ఉంటాయని శేఖర్ గుప్తా వెల్లడించారు.
Also Read:
సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..
ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్..
https://www.instagram.com/p/CC11YDKhKzV/?utm_source=ig_web_copy_link
