Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..

Bird Flu: మనుషులకూ బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని వైద్యులు గుర్తించారు. రష్యాలో మొదటి కేసు నమోదైంది. మనిషిలో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా..

Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Feb 21, 2021 | 1:55 PM

Bird Flu: మనుషులకూ బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని వైద్యులు గుర్తించారు. రష్యాలో మొదటి కేసు నమోదైంది. మనిషిలో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే రష్యాలో గుర్తించిన ఈ బర్డ్‌ ఫ్లూ మొదటి కేసు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. పక్షుల ద్వారా వ్యాపించే ఈ బర్డ్‌ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. కాగా, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని తెలుస్తోంది. పౌల్ట్రీ పామ్‌లో ఉండే కార్మికులపై ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. దీనిపై పరిశోధకులు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ పక్షులకు సోకిన తర్వాత అవి అనారోగ్యంగా ఉన్నా, చనిపోయినా కూడా మనుషులకు వ్యాప్తించే అవకాశం ఉందని, అంతేకాదు ఈ బర్డ్‌ ఫ్లూ వల్ల మరణానికి దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాలని భావిస్తున్నారు.

కాగా, దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ పంజా విసిరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్ ‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, యూపీతో పాటు పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగా లక్షల్లో జంతువులు మృత్యువాత పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బర్డ్‌ ఫ్లూ కారణంగా రాష్ట్రాలన్ని అప్రత్తమంగా ఉండాలని, బర్డ్‌ ప్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది.

మనుషులకు వ్యాప్తించే ఈ బర్డ్‌ ఫ్లూ అనేక లక్షణాలు బయటపడుతున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అతిసారం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, వికారం, వాంతులు, తలనొప్పి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఎటువంటి లక్షణాలు లేకుండా కేవలం కంటికి కూడా సంక్రమించవచ్చని తెలుస్తోంది. ఈ బర్డ్‌ ఫ్లూ వైరస్‌లు రెండు రకాలుగా ఉంటాయి. మానవులలో అత్యంత సాధారణ రకం H5N1. ఇది పక్షుల ద్వారా ప్రధానంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. మనుషుల్లో ఈ వైరస్‌ సాధారణమైన యాంటీవైరస్‌ ఔషధాలకు నిరోధకతను అభివృద్ధి చేస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ ఔషధాలను సూచిస్తున్నారు. పక్షులకు సోకే బర్డ్‌ ఫ్లూ మనుషులకు సంక్రమింస్తుండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Coffee Drink: ప్రతి రోజు కాఫీ తాగే వారికి షాకింగ్‌ న్యూస్‌.. తాజా పరిశోధనలలో వెల్లడి

మంచు తుపానుతో విలవిల, టెక్సాస్ కు ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్

బెంగాల్ ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం సిద్డం ! ఈ నెల 25 న కోల్‌కతాకు వెళ్లనున్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.

జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!