AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Cold Storm:మంచు తుపానుతో విలవిల, టెక్సాస్ కు ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్

US Cold Storm: అమెరికాను మంచుతుపాను వణికిస్తోంది. అనేక రాష్ట్రాలు తీవ్రమైన శీతల వాతావరణంతో అల్లాడుతున్నాయి. విద్యుత్, నీటి సౌకర్యం లేక లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

US Cold Storm:మంచు తుపానుతో విలవిల, టెక్సాస్ కు ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 21, 2021 | 1:40 PM

Share

US Cold Storm: అమెరికాను మంచుతుపాను వణికిస్తోంది. అనేక రాష్ట్రాలు తీవ్రమైన శీతల వాతావరణంతో అల్లాడుతున్నాయి. విద్యుత్, నీటి సౌకర్యం లేక లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రం కనీవినీ ఎరుగని పరిస్థితిని ఎదుర్కొంటోంది. విద్యుత్ సౌకర్యం లేకపోవడం, నీరు కూడా గడ్డ కట్టుకుపోవడం, హీటర్లు పని చేయకపోవడంతో జనాభాలో సగం మంది ఇప్పటికీ మంచు తుపాను విలయానికి బెంబేలెత్తుతున్నారు. గజగజ వణికించే చలిని తట్టుకోలేక సుమారు 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితిలో టెక్సాస్ ను ఆదుకునేందుకు అధ్యక్షుడు జోబైడెన్.. దీనికి ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఈ సాయం కింద బాధితులకు కొంత సొమ్మును అందజేయనున్నారు. అలాగే తాత్కాలిక గృహ నిర్మాణాలకు, గృహ మరమ్మతులకు  అతి తక్కువ వడ్డీతో  రుణాలను ఇస్తారని అధికారులు తెలిపారు. ఇక బైడెన్ కూడా త్వరలో టెక్సాస్ ను  సందర్శిస్తారని వారు చెప్పారు.

మరోవైపు ఈ రాష్ట్ర గవర్నర్ గైగ్ ఎబాట్ తో వైట్ ఔస్ సదా టచ్ లో ఉంటోంది. అయితే బాధితులకు ఇచ్ఛే నగదు సాయాన్ని పెంచాల్సిందిగా తాను కోరినప్పటికీ బైడెన్ ప్రభుత్వం చాలా తక్కువగా సాయాన్ని ప్రకటించిందని ఎబాట్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈయన రిపబ్లికన్ అయినా… అధ్యక్షునిగా  బైడెన్ ప్రమాణ స్వీకారం పట్ల నాడు (జనవరి 20న) హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

Also Read:

Hairball in Stomach:కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలిక.. పేగుల్లో హెయిర్ బాల్‌ను చూసి షాక్ తిన్న డాక్టర్లు ఎక్కడంటే..!

No Bridge No Marraige : ఆ గ్రామంలో యువతని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపని చుట్టుపక్కల గ్రామస్థులు ఎందుకంటే..!