క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, 23 న ఢిల్లీ కోర్టు తీర్పు
క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. టూల్ కిట్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఈమె..
క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. టూల్ కిట్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఈమె..5 రోజులు పోలీసుల కస్టడీలో ఉండగా 2 రోజులు జైల్లో గడిపింది. దిశారవి బెయిల్ పిటిషన్ పై శనివారం కోర్టులో గంటకు పైగా వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసులో పోలీసుల వాదన పట్ల జడ్జి ధర్మేంద్ర రానా కొంత అసహనం వ్యక్తం చేశారు. తన ఆత్మసాక్షిని సంతృప్తి పరచేవరకు తీర్పునిచ్ఛే విషయంలో ముందడుగు వేయలేనన్నారు. ఆ తరువాత తీర్పును వచ్ఛే మంగళవారానికి రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దిశారవికి వేర్పాటువాద శక్తులతో లింక్ ఉందని, రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసను ప్రేరేపించేందుకు కుట్ర చేసిందని పోలీసులు ఆరోపించారు. అయితే ఇది సమగ్ర సమాచారంలేని అభిప్రాయంగా కనిపిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అసలు టూల్ కిట్ అంటే ఏమిటి ? ఇది హానికరమైనదా అని ఆయన ప్రశ్నించారు. గత జనవరి 26 న జరిగిన హింసతో దిశారవికి ప్రమేయం ఉందనడానికి మీరు సేకరించిన ఆధారాలు ఏమిటని కూడా ఆయన అన్నారు. కుట్రకు, నేరానికి మధ్య కనెక్షన్ ఉందా..తెలుసుకోగోరుతున్నాను అని కూడా అన్నారు.
దిశారవి తరఫున వాదించిన న్యాయవాది సిద్దార్థ్ అగర్వాల్.. ఏ వేర్పాటువాద శక్తులతోనూ తన క్లయింటుకు సంబంధం లేదన్నారు. ‘పోయెట్ జస్టిస్ ఫౌండేషన్’ తో మాత్రమే తన ఛాటింగులు జరిగాయని, అది ప్రమాదకరమైనదే అయితే ప్రభుత్వం దాన్ని ఎందుకు నిషేధించలేదన్నారు. నేను ఆ సంస్థతో టచ్ లో ఉన్నానని పోలీసులు అంటున్నారు.. కానీ దాన్ని బ్యాన్ చేశారా ? లేదే….అన్నారు.
ఖలిస్తాన్ గ్రూప్ ను పునరుధ్ధరించేందుకే దిశారవి టూల్ కిట్ ను రూపొందించి, ఉపయోగించుకున్నదని, ఆమె కీలక కుట్రదారి అని పోలీసులు ఆరోపించారు. కాగా-దిశారవికి తన మద్దతు ప్రకటిస్తూ స్వీడిష్ క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ ట్వీట్ చేసిన విషయం గమనార్హం..
మరిన్ని చదవండి ఇక్కడ :
ఈనెల 26న భారత్ బంద్.. జీఎస్టీ మార్పు కోరుతూ దేశవ్యాప్త ఆందోళనకు అఖిల భారత వర్తక సమాఖ్య పిలుపు
flipkart offer : ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్… వినియోగదారులకు ‘గ్రూపు సేఫ్ గార్డ్’ను ఆఫర్