‘బెంగాల్ కు సొంత కూతురే కావాలి’, ‘బయటివారిని పంపేయండి’, తృణమూల్ కాంగ్రెస్ కొత్త నినాదం,
బెంగాల్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కొత్త నినాదాన్ని ప్రకటించింది. 'బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్' (బెంగాల్ కి సొంత కూతురే కావాలి) అన్న....
బెంగాల్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కొత్త నినాదాన్ని ప్రకటించింది. ‘బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్’ (బెంగాల్ కి సొంత కూతురే కావాలి) అన్న ఈ స్లోగన్ తో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అంటే టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని మళ్ళీ ఎన్నుకోవాలన్నదే దీని ఉద్దేశం.. ఆమెను ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆప్యాయంగా ‘దీదీ’ (అక్క) అని పిలుచుకుంటారు. రానున్న ఎన్నికల్లో ‘బయటివారితో’ (బీజేపీతో) పోరాడాలని కూడా నేతలు పిలుపునిచ్చారు. బయటి నుంచి వచ్ఛే గూండాలను తరిమి కొట్టాలని మమత తరచూ ఆవేశంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఆమె తాను పాల్గొనే ప్రతి సభలోనూ ముఖ్యంగా మహిళలకు ఈ పిలుపునిస్తుంటారు. కాగా- ఈ కొత్త నినాదాన్ని పార్టీ లాంచ్ చేయగానే మమత మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఉత్తర బెంగాల్ లోని నగ్రకతలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ బెంగాల్ కూతురు (మమత) ఢిల్లీ ముందు తలవంచి సరెండర్ కావాలని మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. బయటి నుంచి వస్తున్న కొంతమంది ఈ రాష్ట్ర సంస్కృతిని అంతమొందించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బెంగాల్ కి సొంత కుమార్తె అంటూ కావాలని, అలాంటప్పుడు బయటివారిని పంపించివేయాలని ఆయన అన్నారు.
బీజేపీ నినాదమైన జైశ్రీరామ్ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. మిమ్మల్ని జైహింద్ అని గానీ, జైబంగ్లా అని గానీ అనేలా చేస్తామన్నారు. జై సియా రామ్ అని బీజేపీ ఎందుకు నినదించదని ప్రశ్నించారు. మహిళల పట్ల వారికి గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. తమ నినాదంలో వారు సీతాదేవిని ఎందుకు ప్రస్తావించరని కూడా ప్రశ్నించారు. .
మరిన్ని చదవండి ఇక్కడ :
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుషం… చికిత్స కోసం వచ్చిన మహిళను ఈడ్చుకెళ్లిన సెక్యూరిటీ గార్డు..!
షాకింగ్ న్యూస్.. మనుషులకూ బర్డ్ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..