రేపు రైతు నేతలతో భేటీ కానున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజకీయ ఉద్దేశమా ?లేక ?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం రైతు నేతలతో భేటీ కానున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వీరి సమస్యలను, ఇతర అంశాలను ఆయన తెలుసుకోగోరుతున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం రైతు నేతలతో భేటీ కానున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వీరి సమస్యలను, ఇతర అంశాలను ఆయన తెలుసుకోగోరుతున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీని కాంగ్రెస్ ఓడించి.. స్వీప్ చేసిన నేపథ్యంలో రైతులతో ఈయన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన వారిని కలుసుకోనున్నారు. నిజానికి రైతుల నిరసనకు ఆప్ మొదటి నుంచీ మద్దతునిస్తోంది. కానీ ఈ ఎన్నికల్లో అన్నదాతలు కాంగ్రెస్ కి బాసటగా నిలవడం ఆప్ నేతలకు అర్థం కావడంలేదు. ఈ ఎన్నికల ఫలితాలు వారి మూడ్ ను తెలియజేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ లోగడ చాలాసార్లు రైతు నాయకులతో భేటీ అయి వారి ఆందోళనకు సపోర్ట్ ప్రకటించిన విషయం గమనార్హం. వారి నిరసన స్థలాలకు వెళ్లారు కూడా.. అలాగే ఆప్ కార్యకర్తలు వారికి ఆహారం సమకూర్చారు. కేజ్రీవాల్ సర్కార్ వారికీ నీరు, విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించింది.
ఒక సందర్భంలో ఢిల్లీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి కేజ్రీవాల్ వ్యవసాయ చట్టాల ప్రతులను చించివేశారు కూడా..