త్వరలో అందుబాటులోకి రానున్న ‘స్పుత్నిక్‌ వి’ టీకా.. అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన రెడ్డీస్ ల్యాబ్స్

కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ కి అత్యవసర వినియోగ అనుమతి పొందడం కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సన్నాహాలు ప్రారంభించింది.

త్వరలో అందుబాటులోకి రానున్న ‘స్పుత్నిక్‌ వి’ టీకా..  అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన రెడ్డీస్ ల్యాబ్స్
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 20, 2021 | 7:45 PM

Sputnik V Vaccine V: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు మరో టాకీ అందుబాటులో రానుంది. కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ కి అత్యవసర వినియోగ అనుమతి పొందడం కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సన్నాహాలు ప్రారంభించింది. ఫేజ్‌-2 క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) కి అందజేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. అనుమతి రాగానే అత్యవసర వినియోగానికి తీసుకురానున్నట్లు తెలిపింది.

రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) సంస్థ స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకాను భారత దేశంలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మధ్యంతర సమాచారం ప్రకారం ఈ టీకా 91.6 శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయిందని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. స్పుత్నిక్‌ వి కి ‘అత్యవసర అనుమతి’ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టామని, దీనివల్ల మనదేశంలో కొవిడ్‌-19 టీకా లభ్యత పెరిగి ప్రజలకు మరింత మేలు జరుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో-ఛైర్మన్‌ జీవీ ప్రసాద్‌ వివరించారు.

‘హ్యూమన్‌ అడెనోవైరల్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫామ్‌’ ఆధారంగా స్పుత్నిక్‌ వి టీకాను తయారు చేసినట్లు రెడ్డీస్ ల్యాబ్స్ వివరించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రతినిధుల వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 90 శాతానికి పైగా ప్రభావశీలత కలిగిన మూడు టీకాల్లో స్పుత్నిక్‌ వి టీకా ఒకటి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో అనుమతులు వచ్చాయి. ఇప్పటికే 20 లక్షల మందికి ఈ టీకా ఇచ్చారని పేర్కొంది.

ఇదీ చదవండి …. Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..