ఆంధ్రప్రదేశ్‌లో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 54 మందికి కోవిడ్ పాజిటివ్
మెల్లమెల్లగా మరోసారి ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరగుతుంది. గడిచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
AP corona cases : మెల్లమెల్లగా మరోసారి ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరగుతుంది. గడిచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఇవాళ సాయంత్ర విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,210కి చేరింది. ఇ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,167కి చేరింది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 70 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,439కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 604 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,97,048 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.