గన్నవరం విమానాశ్రయంలో తప్పిన పెనుప్రమాదం.. విమానం ల్యాండింగ్ సమయంలో చోటుచేసుకున్న ఘటన
గన్నవరంలో ల్యాండింగ్ సమయంలో విమానానికి ప్రమాదానికి గురైంది. దోహా నుండి విజయవాడ వచ్చిన విమానం ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి విజజవాడకు వచ్చి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన గన్నవరం ఏయిర్‌పోర్టు అథారిటీ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేశారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు… వారిలో గన్నవరంలో 19 మంది ప్రయాణికులు దిగారు. మిగిలిన 45 మంది ప్రయాణికులు తిరుచ్చానూరు వెళ్లవల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.