AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australian Open 2021: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర.. టైటిల్ గెలుచుకున్న నవోమి ఒసాకా..

Australian Open 2021:ఆస్ట్రేలియన్​ ఓపెన్ ఛాంపియన్​గా జపాన్​ టెన్నిస్​ స్టార్​ నవోమి ఒసాకా నిలిచింది.  ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను..

Australian Open 2021: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర.. టైటిల్ గెలుచుకున్న నవోమి ఒసాకా..
Naomi Osaka won Australian 2021 champion
Sanjay Kasula
|

Updated on: Feb 20, 2021 | 6:11 PM

Share

Australian Open 2021: ఆస్ట్రేలియన్​ ఓపెన్ ఛాంపియన్​గా జపాన్​ టెన్నిస్​ స్టార్​ నవోమి ఒసాకా నిలిచింది.  ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. శనివారం జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మ‌హిళ సింగిల్స్ ఫైన‌ల్లో ఆమె చాంపియ‌న్‌గా నిలిచింది. దీంతో న‌వోమి ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు వచ్చి చేరాయి.

శనివారం జరిగిన ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన జెన్నిఫర్‌ బ్రాడీ ని 6-4, 6-3 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో ఫేవరేట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఒసాకా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుస సెట్లలో బ్రాడీని చిత్తు చేసింది.

ఈ టైటిల్ ఒసాకాకు మొత్తంగా నాలుగోది కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండోది. కాగా ఆడిన తొలి నాలుగు గ్రాండ్‌స్లామ్‌లనూ సొంతం చేసుకున్న మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 1990-91లలో ఇంగ్లండ్‌కు చెందిన మోనికా సెలెస్ ఈ ఫీట్‌ సాధించారు. ఆ తరువాత మరెవ్వరూ ఈ ఘనత దక్కించుకోలేకపోయారు. ఇన్నాళ్లకు ఒసాకా మళ్లీ అదే రికార్డు నెలకొల్పింది.

2016లో జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో ఒసాకా ఓ క్వాలిఫ‌య‌ర్‌గా గ్రాండ్‌స్లామ్ ఎంట్రీ ఇచ్చింది.  ఆ ఏడాది మూడో రౌండ్‌లో ఓడిపోయిందామె. ఏప్రిల్ 2016లో వ‌ర‌ల్డ్ వంద ర్యాంకుల్లో చోటు సంపాదించింది. ఆ త‌ర్వాత ఏడాది టాప్ 50లో చోటు ద‌క్కించుకున్న‌ది.

2016లో డ‌బ్ల్యూటీఏ కొత్త క్రీడాకారిణిగా అవార్డును గెలుచుకున్న‌ది. ఆ ఏడాదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో ఆడింది.  2018 మార్చిలో తొలి డ‌బ్ల్య‌టీఏ టైటిల్ గెలుచుకున్న‌ది. ఆ టోర్నీలో ష‌ర‌పోవా, క‌రోలినా, హ‌లెప్ లాంటి వాళ్ల‌ను ఓడించింది. త‌న కెరీర్‌లో వ‌రుస‌గా నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్స్ గెలిచిన మోనికా సెలెస్(1991) రికార్డును స‌మం చేసింది ఒసాకా.

2019లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచింది. ఆ ఫైన‌ల్‌ మ్యాచ్‌లో సెరీనాను ఓడించింది.  2019 ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్లో పెట్రా క్విటోవాపై గెలుపొందింది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!