AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Elections 2021: ఏపీలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ పోలింగ్.. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారుల ప్లాన్..

AP Local Elections Phase 4: ఏపీలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా భారీగా..

AP Panchayat Elections 2021: ఏపీలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ పోలింగ్.. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారుల ప్లాన్..
AP 4rth Phase Elections
Sanjay Kasula
|

Updated on: Feb 20, 2021 | 9:53 PM

Share

AP Local Elections Phase 4: ఏపీలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.

గుంటూరు అర్భన్ పరిధిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. 80పంచాయతీలు, 900వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మండలాలకు ఎఎస్పీలు ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ.. పోలింగ్‌ను పరిశీలిస్తారు. ముందస్తు చర్యల్లో భాగంగా 173 కేసుల్లో 1900మందిని బైండోవర్ చేశామన్నారు అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డి.

శ్రీకాకుళంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని 259 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.చివరి దశలో 274 నామినేషన్ల ఉపసంహరణతో పాటు 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 5400 మంది పోలింగ్ సిబ్బంది, 1500 పోలీసులు విధుల్లో పాల్గొనున్నారు.

కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్లంోని గంపలగూడెం, ఏ.కొండూరు, విసన్నపేటలో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు అనంతపూర్ జిల్లా పెనుగొండ డివిజనల్ వ్యాప్తంగా జరిగిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ నిశాంత్ పరిశీలించారు. 184 సర్పంచ్, 1765 వార్డు మెంబర్ల ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 80శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు జేసీ.

పశ్చిమగోదావరి జిల్లాలో 237 పంచాయతీల్లో జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏలూరు ఆర్డీవో రచన. ఇక విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఎన్నికల సిబ్బంది దర్నాకు దిగారు. భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదంటూ ఆందోళన చేశారు. గజపతినగరం నుంచి ఆండ్ర వెళ్లే రహదారిని దిగ్భందించారు. మొత్తానికి తుది విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..