బీహార్‌లో విషాదం.. పరీక్ష హాల్‌లో ప్రాణం పోయింది.. ఎగ్జామ్ రాస్తూనే విద్యార్థి మృతి
బీహార్‌లో షరీఫ్‌లో హృదయ విధారక సంఘటన చోటుచేసుకుంది. షరీఫ్‌లోని ఆదర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ శుక్రవారం పాఠశాలలోనే మరణించాడు.
బీహార్‌లో షరీఫ్‌లో హృదయ విధారక సంఘటన చోటుచేసుకుంది. షరీఫ్‌లోని ఆదర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ శుక్రవారం పాఠశాలలోనే మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వివరాల్లోకెళితే.. షరీఫ్‌లోని ఆదర్శ్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న రోహిత్ గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే అతని ఆరోగ్య సరిగా లేనందున్న అధికారులు అతడిని 2021 బీఎస్ఈబీ పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి నిరాకరించారు. అయితే తన విద్య సంవత్సరం వృధా అవుతుందనే భయంతో పరీక్ష రాయడానికి రోహిత్ మొండిగా ఎగ్జామ్ రాస్తా అంటూ ఉపాద్యాయులతో వాదించాడు. దీంతో అక్కడి టీచర్స్ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి తమ కుమారుడిని ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలంటూ కోరారు. చేసేదేం లేక ఉపాద్యాయులు ఆ బాలుడిని పరీక్ష రాసేందుకు అనుమతించారు. రోహిత్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలో అతని ఆరోగ్యం మరింత క్షీణించి కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. 16 ఏళ్ళ రోహిత్ ఆస్తామాతో బాధపడుతున్నట్లుగా డాక్టర్స్ తెలిపారు.
ఇక అంతకుముందు శుక్రవారం మొదటి షిప్టులో జరుగుతున్న పదవ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్ట్ పరీక్షను బీఎస్ఈబీ రద్దు చేసింది. మార్చి 8న తిరిగి ఆ పరీక్ష నిర్వహించనున్నట్లుగా బీహార్ బోర్డ్ అధ్యక్షుడు కిషోర్ తెలిపారు. సోషల్ సైన్స్ యొక్క మొదటి షిప్టులో 8,46,504 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని.. ఆ పరీక్ష తిరిగి మార్చి 8న జరుగుతుందని తెలిపారు. ఎగ్జా్మ్ పేపర్ లీకైన విషయం పై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,525 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీహార్ లో పదవ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 24 వరకు జరుగనున్నాయి.
Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్టియర్ క్లాసుల పునఃప్రారంభం మళ్లీ వాయిదా.!