ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్టియర్ క్లాసుల పునఃప్రారంభం మళ్లీ వాయిదా.!
ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. నవంబర్ 16వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్మీడియేట్ ఫస్టియర్ క్లాసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
AP Inter Classes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. నవంబర్ 16వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్మీడియేట్ ఫస్టియర్ క్లాసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ కీలక ప్రకటన చేశారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం నుంచి మొదలు కావాల్సి ఉందని.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని వాయిదా వేస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు.
కాగా, ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్య 88 నుంచి 40కి తగ్గించడంతో ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనితో ఆన్‌లైన్ ప్రవేశాల్లో కూడా జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే కేసు ఇంకా ఓ కొలిక్కి రానుందున ఇంటర్ బోర్డు మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, నవంబర్ 2 నుంచి ఏపీ వ్యాప్తంగా 9,10, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాగా.. ఈ నెల 23వ తేదీ నుంచి 6,7,8 తరగతులు, డిసెంబర్ 14 నుంచి 1 నుంచి 5 తరగతులు పున: ప్రారంభం కానున్నాయి.
Also Read:
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..