AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia New Rules: సెక్స్ చేస్తే పెళ్లి అయినట్లే.. రూల్స్ మార్చిన పెద్ద దేశం.!

Russia New Rules On Pre Marital Sex: పెళ్లికి ముందు సెక్స్ భారతదేశంలో తీవ్రమైన నేరంగా పరిగణించరు. ఇప్పటికే స్వలింగ సంపర్క వివాహాలు, వివాహేతర సంబంధాలపై పలు చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన రష్యా మాత్రం పెళ్లి విషయంలో పలు రాజ్యాంగబద్ధమైన నియమాలను మార్చేందుకు సన్నద్ధమవుతోందట. అదీ కూడా సెక్స్‌కు పెళ్ళికి మధ్య గట్టిగా లింక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. సెక్స్ అంటే […]

Russia New Rules: సెక్స్ చేస్తే పెళ్లి అయినట్లే.. రూల్స్ మార్చిన పెద్ద దేశం.!
Ravi Kiran
|

Updated on: Mar 04, 2020 | 2:17 PM

Share

Russia New Rules On Pre Marital Sex: పెళ్లికి ముందు సెక్స్ భారతదేశంలో తీవ్రమైన నేరంగా పరిగణించరు. ఇప్పటికే స్వలింగ సంపర్క వివాహాలు, వివాహేతర సంబంధాలపై పలు చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన రష్యా మాత్రం పెళ్లి విషయంలో పలు రాజ్యాంగబద్ధమైన నియమాలను మార్చేందుకు సన్నద్ధమవుతోందట. అదీ కూడా సెక్స్‌కు పెళ్ళికి మధ్య గట్టిగా లింక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

సెక్స్ అంటే పెళ్ళికి సంబంధించినదని.. ఒకరితో శారీరికంగా పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్లేనని రష్యా నియమం పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి రాజ్యాంగంలో కూడా పలు సవరణలు చేయడానికి సిద్దమయ్యారట. పెళ్లి ఈక్వెల్స్ టూ సెక్స్.. సెక్స్ ఈక్వెల్స్ టూ పెళ్లి అనే రూల్‌ను త్వరలోనే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంతవరకు బాగానే ఉంది గానీ.. మనిషి సంప్రదాయాలకు కట్టుబడి ఎంతవరకు ఈ నియమాన్ని పాటిస్తాడన్నది చూడాలి. సెక్స్ కోసమే పెళ్లి చేసుకోవడం.. లేదా సెక్స్ చేసిన వారితో పెళ్లి అయిందంటే.. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఇలాంటి నేపథ్యంలో రష్యా ప్రభుత్వం తీసుకురానున్న ఈ రూల్ ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో మరి. అటు స్వలింగ సంపర్క వివాహాలపై కూడా నిషేధం విధించాలని పుతిన్ నిర్ణయానికి వచ్చారని సమాచారం. వీటిపై కొత్త చట్టాలను చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

For More News:

ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్…

కోనసీమలో కరోనా కలకలం..!

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?

‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…

వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…

ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు..

సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!

Follow Us