కరోనా ఎఫెక్ట్.. ఆ రంగులతో హోలీ వద్దే వద్దు.. రీజన్ ఇదే..!

హోలీ.. ఈ పండుగొచ్చిందంటే చాలు.. చిన్నా పెద్ద అంతా కలిసి.. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సారి ఈ పండుగ జరుపుకునే ముందు కాస్త జాగ్రత్తలు వహించాలని వైద్యులు చెప్తున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. అవును హోలీకి కరోనాకు లింకేంటి అని డౌట్ వస్తుందేమో. కానీ.. ప్రస్తుతం పొరుగు దేశమైన చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండు వేల మందికి పైగా మృతిచెందగా.. […]

కరోనా ఎఫెక్ట్.. ఆ రంగులతో హోలీ వద్దే వద్దు.. రీజన్ ఇదే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 04, 2020 | 6:52 PM

హోలీ.. ఈ పండుగొచ్చిందంటే చాలు.. చిన్నా పెద్ద అంతా కలిసి.. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సారి ఈ పండుగ జరుపుకునే ముందు కాస్త జాగ్రత్తలు వహించాలని వైద్యులు చెప్తున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. అవును హోలీకి కరోనాకు లింకేంటి అని డౌట్ వస్తుందేమో. కానీ.. ప్రస్తుతం పొరుగు దేశమైన చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండు వేల మందికి పైగా మృతిచెందగా.. దాదాపు ఎనభై వేల మందికి పైగా వైరస్ బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన దేశంలో రాబోయే హోలీ పండుగపైన కూడా ఈ కరోనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

అయితే గత కొద్ది రోజులుగా చైనా రంగులతో కరోనా వైరస్ వ్యాపిస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. చైనా నుంచి వస్తున్న హోలీ రంగుల్లో కరోనా వైరస్ వ్యాపిస్తోందని.. ఈ సారి హోలీ పండుగను స్వదేశీ కలర్లతోనే జరుపుకోవాలని.. చైనా రంగులను దూరం పెట్టాలంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై వైద్యులు కూడా రెస్పాండ్ అయ్యారు. కరోనా వైరస్ అనేది.. రంగులతో రాదని.. అంతకుముందే వైరస్ సోకిన వ్యక్తి ద్వారానే సోకుతుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ అనేది విజృంభిస్తోందని.. కాబట్టి అక్కడి నుంచి వచ్చే చైనీస్ రంగులను వాడితే.. అందులో వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు. ఏదేమైనా కూడా.. ఈ సారి హోలీ పండుగకు చైనీస్ రంగులను నిషేధించడమే ఉత్తమమని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. సో ఈ సారి హోలీ పండుగకు చైనీస్ రంగులను దూరంపెట్టి.. స్వదేశీ రంగులను ఉపయోగించండమే బెటర్ అని వైద్యుల అభిప్రాయం.