AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JC on Ys Jagan: జగన్‌పై జేసీ సంచలన కామెంట్

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పట్లాగానే తన నోటికి పని చెప్పారు. అయితే.. ఈసారి ఏ పోలీసులనో.. అధికారులనో కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా, ఆయన పరిపాలనపైనా జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

JC on Ys Jagan: జగన్‌పై జేసీ సంచలన కామెంట్
Rajesh Sharma
|

Updated on: Mar 04, 2020 | 6:49 PM

Share

JC Diwakar Reddy interesting comments on YS Jagan: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పట్లాగానే తన నోటికి పని చెప్పారు. అయితే.. ఈసారి ఏ పోలీసులనో.. అధికారులనో కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా, ఆయన పరిపాలనపైనా జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తద్వారా సొంత పార్టీకి, పార్టీ అధినేతకు కొత్త తలనొప్పి క్రియేట్ చేశారు జేసీ దివాకర్ రెడ్డి.

స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు మునిసిపల్, పంచాయతీ ఎలక్షన్లలో పోటీ చేయబోమని ప్రకటించారు జేసీ దివాకర్ రెడ్డి. అయితే.. అది టీడీపీ నిర్ణయమా.. లేక సొంత జిల్లాలో తన అనుచర వర్గానికి సంబంధించిన ప్రకటన అన్నది తేలలేదు. దేశంలో ఎప్పుడు లేనంతగా ఈ సారి స్థానిక ఎన్నికల్లో 99 శాతం మంది ఏకగ్రీవంగా ఏన్నికవుతారని జేసీ దివాకర్ జోస్యం చెప్పారు.

మరో అడుగు ముందుకేసిన జేసీ దివాకర్.. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందంటూ కితాబునిచ్చారు. ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కూడా డబ్బు, మద్యం పంచినట్లు తేలితే తమ వారిని జైల్లో పెడతారని, అలాంటప్పుడు భవిష్యత్తులో ఇబ్బంది పడే బదులు ఇప్పుడే పోటీకి దూరంగా వుంటే బెటరన్నది తన అభిప్రాయమని జేసీ చెప్పుకొచ్చారు. ఎంతైనా జేసీ కదా.. ఏమైనా అనగలరు.. మర్నాడే తన మాటలకు మీడియా వక్రభాష్యం చెప్పిందని చెప్పుకోను గలరు.

ఇదీ చదవండి: ఇక అవన్నీ జగనన్న కాలనీలే.. YSR Jagananna colonies in Andhra Pradesh soon