AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడేళ్ల క్రితం మిస్సైన భార్య.. హత్యారోపణలతో జైళ్లో భర్త.. కట్ చేస్తే.. లవర్‌తో ప్రత్యక్షం..

ఒడిశా రాష్ట్రంలోని జిల్లాలో ఊహించని ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడేళ్ల క్రితం చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రత్యక్షమైంది. సదరు మహిళను భర్తే హత్య చేశాడనే నేరారోపణతో అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇంతకాలానికి కనిపించిన ఆమె..అసలు విషయం బయటపెట్టింది.

ఏడేళ్ల క్రితం మిస్సైన భార్య.. హత్యారోపణలతో జైళ్లో భర్త.. కట్ చేస్తే.. లవర్‌తో ప్రత్యక్షం..
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 05, 2020 | 3:08 PM

Share

ఒడిశా రాష్ట్రంలోని జిల్లాలో ఊహించని ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడేళ్ల క్రితం చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రత్యక్షమైంది. సదరు మహిళను భర్తే హత్య చేశాడనే నేరారోపణతో అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇంతకాలానికి కనిపించిన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా..అసలు విషయం బయటపెట్టింది. పూర్తి వివరాలు పరిశీలించగా..

ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన అభయ్‌ సుతారా అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఇతిశ్రీ మొహరానాతో 2013లో వివాహమైంది. పెళ్లయిన రెండు నెలలకే ఇతిశ్రీ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఎంత గాలించిన ఇతిశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అల్లుడిపై అనమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని అల్లుడే వరకట్నం కోసం చిత్రహింసలు పెట్టి, చివరికి చంపేశారని, భార్యను హత్య చేసి ఆమె శవాన్ని కూడా కనిపించకుండా మాయం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కేసులో ఎటువంటి ఆధరాలు లభించకపోవటంతో.. నెల రోజుల తరువాత అతడిని బెయిలుపై విడుదల చేశారు.

జైలు నుంచి బయటకు వచ్చాక అతన్ని అందరూ భార్యను చంపిన హంతకుడిగానే చూడటంతో భరించలేకపోయాడు. తన భార్య ఆచూకీ కోసం వెతకటం మొదలుపెట్టాడు. జిల్లాతో పాటుగా, చుట్టూ పక్కల ప్రాంతాల్లోనూ గాలించాడు. అలా..ఏడేళ్ల తర్వాత ఓ రోజు పూరి జిల్లాలోని పిపిలీ ప్రాంతంలో అభయ్‌కి ఇతిశ్రీ కనపడింది. దీంతో అభయ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా…ఆమె రాజీవ్ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అభయ్‌తో వివాహం కంటే ముందే రాజీవ్‌ను ప్రేమించానని కానీ తల్లిదండ్రలు ఒప్పుకోకపోవడంతో పెళ్లైన తరువాత రాజీవ్‌తో కలిసి కోల్‌కతా పారిపోయానని చెప్పటంతో పోలీసులే ఖంగుతిన్నారు. మొత్తానికి అతను తన మీద పడ్డ హత్యారోపణను తొలగించుకున్నాడు.