అంత సొమ్ము లేదు.. జీతాలు ఎలా ఇవ్వగలం?

ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి రెండు వారాలు దాటింది. ఇప్పటికీ సమ్మెపై హైకోర్టు కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే సమ్మె చేపట్టిన కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఏకంగా వారి జీతాల విడుదలను కూడా నిలిపివేసింది. ఇదే విషయంలో హైకోర్టు విచారణ కూడా చేపట్టి.. కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై మల్లగుల్లాలు పడుతోంది. సోమవారం ఇదే అంశాన్ని హైకోర్టుకు తెలిపింది. సిబ్బందికి […]

అంత సొమ్ము లేదు.. జీతాలు ఎలా ఇవ్వగలం?
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 9:03 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి రెండు వారాలు దాటింది. ఇప్పటికీ సమ్మెపై హైకోర్టు కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే సమ్మె చేపట్టిన కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఏకంగా వారి జీతాల విడుదలను కూడా నిలిపివేసింది. ఇదే విషయంలో హైకోర్టు విచారణ కూడా చేపట్టి.. కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై మల్లగుల్లాలు పడుతోంది.

సోమవారం ఇదే అంశాన్ని హైకోర్టుకు తెలిపింది. సిబ్బందికి జీతాలు చెల్లించలేమంటూ పేర్కొంది. జీతాలు చెల్లించాలంటే మొత్తం రూ.239 కోట్లు అవసరమవుతాయని, కానీ ఆర్టీసీ వద్ద కేవలం రూ.7.49 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమని మరోసారి ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ న్యాయస్ధానానికి వివరించారు. అయితే చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని, వారికి జీతాలు రాకపోవడంతో పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న్యాయస్ధానానికి విన్నవించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.