సర్వేలన్నీ ఆపార్టీవైపే.. రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టేది ఎవరంటే?

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి. టీవీ9 మరాఠీ ఎగ్జిట్‌పోల్‌: మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలుండగా వీటిలో బీజేపీకి 197, కాంగ్రెస్ 75 స్ధానాలు, ఇతరులు 16 స్ధానాల్లో విజయం సాధించే వీలుందని తేలింది. టీవీ9 భారత్‌వర్ష్‌ ఎగ్జిట్‌పోల్‌: మహారాష్ట్రలో బీజేపీ-197, కాంగ్రెస్‌-75, ఇతరులు-16, హర్యానాలో మొత్తం 90 స్ధానాలుండగా బీజేపీకి 47 […]

సర్వేలన్నీ ఆపార్టీవైపే.. రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టేది ఎవరంటే?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 21, 2019 | 7:59 PM

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి.

టీవీ9 మరాఠీ ఎగ్జిట్‌పోల్‌:

మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలుండగా వీటిలో బీజేపీకి 197, కాంగ్రెస్ 75 స్ధానాలు, ఇతరులు 16 స్ధానాల్లో విజయం సాధించే వీలుందని తేలింది.

టీవీ9 భారత్‌వర్ష్‌ ఎగ్జిట్‌పోల్‌:

మహారాష్ట్రలో బీజేపీ-197, కాంగ్రెస్‌-75, ఇతరులు-16, హర్యానాలో మొత్తం 90 స్ధానాలుండగా బీజేపీకి 47 స్ధానాలు, కాంగ్రెస్ 23 స్ధానాలు, ఇతరులు 20 స్ధానాల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇండియా టుడే-యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్‌:

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా బీజేపీ-శివసేన కూటమిదే అధికారమని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. పూర్తి వివరాల ప్రకారం బీజేపీకి 109-124, శివసేనకు 57-70, కాంగ్రెస్‌కు 32-40,ఎన్సీపీకి 40-50, ఇతరులు 22-32 స్ధానాల్లో విజయం సాధించబోతున్నట్టుగా ఇండియా టుడే పేర్కొంది.

సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18 ఎగ్జిట్‌పోల్‌: 

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి 243 స్ధానాలు, కాంగ్రెస్‌ 41, ఇతరులు 04 స్ధానాల్లో విజయం సాధించబోతున్నారని వెల్లడించింది.

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్‌:

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ కూటమికి -180 స్ధానాలు, కాంగ్రెస్‌-81, ఇతరులు-23 స్ధానాల్లో జయకేతనం ఎగురవేస్తారని అంచనా వేస్తుంది. అదేవిధంగా  హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా వీటిలో బీజేపీ -71, కాంగ్రెస్‌ -11, ఇతరులు-8 విజయం సాధిస్తారని అంచనా వేసింది.

ఏబీపీ-సీవోటర్‌ ఎగ్జిట్‌పోల్:

ఏబీపీ-సీవోటర్‌ ఎగ్జిట్‌పోల్స్ సర్వే కూడా దాదాపు అదే విషయాన్ని వెల్లడిచేస్తూ మహారాష్ట్రలో బీజేపీ-204, కాంగ్రెస్‌-69, ఇతరులు-15 స్ధానాల్లో గెలుపొందబోతున్నారని పేర్కొంది.

అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన శివసేన పోటీ చేసిన దాదాపు స్ధానాల్లో విజయాన్ని పొందబోతున్నట్టుగా సర్వేలు వెల్లడించాయి. మహారాష్ట్రలో మరోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనుండటంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో హర్యానాలో కూడా మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్టుగా సర్వేలు వెల్లడించాయి.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..