థాయ్ రాజు మహా వజీరాలోంగ్‌కోర్న్‌కు ఊహించని షాక్.. నెట్టింట్లో ఆయన ప్రియురాలి అభ్యంతరకర చిత్రాలు
థాయ్‌లాండ్ రాజు మహా వజీరాలోంగ్‌కోర్న్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన ప్రియురాలు సినీనత్ వాంగవజీరాపాక్‌డీ నగ్న చిత్రాలు భారీ సంఖ్యలో లీకయ్యాయి. ఆమె నగ్నంగా, అర్ధనగ్నంగా...
థాయ్‌లాండ్ రాజు మహా వజీరాలోంగ్‌కోర్న్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన ప్రియురాలు సినీనత్ వాంగవజీరాపాక్‌డీ నగ్న చిత్రాలు భారీ సంఖ్యలో లీకయ్యాయి. ఆమె నగ్నంగా, అర్ధనగ్నంగా ఉన్న దాదాపు 1400 చిత్రాలు బయటకు పొక్కాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నారు.
రాజు భార్య సుతీదా, ప్రియురాలు సినీనత్ మధ్య ఉన్న వైరం వల్లే ఈ నగ్న చిత్రాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అవి వైరల్ అయ్యాయి. 2019లో జైలుశిక్ష అనుభవించి, రాజప్రాసాదానికి చేరుకున్న రోజే ప్రియురాలు సినీనత్ న్యూడ్ ఫొటోస్ బయటకు పొక్కడం గమనించాల్సిన విషయం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బ్రిటిష్ జర్నలిస్ట్ ఆండ్ర్యూ మెక్‌గ్రెగర్ మార్షల్‌కు ఈ ఫొటోలు లీకయ్యాయి. 2012 నుంచి 2014 మధ్య ఆమెనే తన ఫోన్‌లో ఈ ఫొటోలు తీసుకున్నట్లు ఉందని – మార్షల్ తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు. కొన్నింట్లో ఆమె టాప్ లెస్‌గా ఉందని, మరికొన్ని ఫొటోల్లో ఆమె నైట్ డ్రెస్ వేసి ఉంది. బహుశా వాటిని రాజుకు పంపడానికి తీసుకుని ఉండొచ్చని మార్షల్ చెప్పుకొచ్చారు.
అలాగే – థాయ్ విద్యావేత్త పవిన్ చచావల‌్‌పాంగ్‌పన్‌కు కూడా ఈ ఫొటోలు అందాయి. వాటిని తాను పబ్లిష్ చేయకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. ఎందుకంటే దీనికి ఆమె అనుమతి తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే – రాజ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరిగిన కుట్రగా అనుమానిస్తున్నారు.
థాయిలాండ్ రాజు భార్య, ఉంపుడుగత్తె మధ్య వైరం ఉంది. ఈ క్రమంలో ఆమె ఫొటోలు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె పరువు తీయడానికే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. రాజు ప్రియురాలు సినీనత్ నగ్న చిత్రాలు బయటకు లీకైన నేపథ్యంలో రాజ కుటుంబం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.