ఆస్ట్రేలియాతో సిరీస్.. జట్టుకు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్!

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ప్రారంభం కాక ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ వేసిన త్రోను క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలికి గాయం అయింది. దీంతో హిట్‌మ్యాన్ కొద్దిసేపు సాధనకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేశాడు. ఈ విషయంపై జట్టు యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన […]

ఆస్ట్రేలియాతో సిరీస్.. జట్టుకు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 13, 2020 | 3:13 PM

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ప్రారంభం కాక ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ వేసిన త్రోను క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలికి గాయం అయింది. దీంతో హిట్‌మ్యాన్ కొద్దిసేపు సాధనకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేశాడు. ఈ విషయంపై జట్టు యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ఫిజియోలు రోహిత్ గాయాన్ని మరోసారి పరీక్షించి ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే రోహిత్ శర్మకు శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ధావన్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించడమే కాకుండా అద్భుతమైన ఫామ్‌ను కూడా కొనసాగించాడు. దీనితో టెస్టుల్లో రోహిత్-ధావన్‌ల కాంబినేషన్‌ను కుదిర్చిన జట్టు యాజమాన్యం.. టీ20ల్లో మాత్రం ధావన్ కన్నా రాహుల్‌కే ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తోంది. కాగా, ఆస్ట్రేలియా టీమ్‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబూషన్,ప్యాట్ కమిన్స్, స్టార్క్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉండటంతో ఈ సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని క్రీడా విశ్లేషకుల భావన.