తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈసారి ఎందుకంటే.?
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న కీలక సమస్యల పరిష్కారంపై నేడు ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని అపరిష్కృత అంశాలు.. జలవనరుల సద్వినియోగం, పలు కీలక విషయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. అంతేకాకుండా తొమ్మిది, పదో షెడ్యూల్డ్ సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలపై కూడా చర్చించి సాధ్యమైనంత త్వరగా.. సామరస్య పూర్వకంగా […]
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న కీలక సమస్యల పరిష్కారంపై నేడు ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని అపరిష్కృత అంశాలు.. జలవనరుల సద్వినియోగం, పలు కీలక విషయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. అంతేకాకుండా తొమ్మిది, పదో షెడ్యూల్డ్ సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలపై కూడా చర్చించి సాధ్యమైనంత త్వరగా.. సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ గతంలోనే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.