AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Vitta: ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు.. ఓపెన్ అయిన మహేష్ విట్టా

తెలుగు చిత్ర పరిశ్రమలో "కమిట్‌మెంట్ కల్చర్"పై మహేష్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్‌లో కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై మహేష్ విట్టా కీలక వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ ఉన్నా, కొందరు దుష్ప్రభావాలకు లోనై కెరీర్ పాడు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.

Mahesh Vitta: ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు.. ఓపెన్ అయిన మహేష్ విట్టా
Mahesh Vitta
Ram Naramaneni
|

Updated on: Dec 10, 2025 | 7:48 PM

Share

టాలీవుడ్‌లో చాన్సులు కోసం ఆరాటపడుతున్న యాస్పైరింగ్ నటీనటులు, ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులపై మహేష్ విట్టా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మట్లాడారు. షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకునే చాలా మంది అమ్మాయిలు తాము భవిష్యత్తులో హీరోయిన్‌లు అవుతామని నమ్ముతారని ఆయన వెల్లడించారు. ఈ ప్రయాణంలో రెండు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారుంటారని విట్టా పేర్కొన్నారు. ఒక వర్గం వారు మంచి విద్యావంతులై, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాల నుండి వస్తుంటారు. తమ పిల్లలు పరిశ్రమలోకి వెళ్లాలనుకుంటే తల్లిదండ్రులు దగ్గరుండి ప్రోత్సహించి పంపిస్తారు. వీరికి రోజుకు రూ.2,000 రెమ్యూనరేషన్ ఇచ్చినా, వారి ప్రయాణం, భోజన ఖర్చులు రూ.2,000 కంటే ఎక్కువ అవుతాయి. అయినా కూడా, డబ్బు వారికి పెద్ద విషయం కానందున, సొంతంగా ఖర్చులు భరించడమే కాకుండా, కొందరు నిర్మాణానికి కూడా సహాయపడతారని మహేష్ విట్టా వివరించారు. ఉదాహరణకు, తాను చేసిన కర్రోడికి తెల్లపిల్ల షార్ట్ ఫిల్మ్‌లో ఒక ఈవెంట్ ఆర్గనైజర్, ఇండస్ట్రీపై ప్యాషన్‌తో కేవలం నటిగా కాకుండా, సొంత ఇంటిని షూటింగ్‌కు ఇచ్చి, భోజన ఏర్పాట్లు చేసి, నిర్మాణానికి డబ్బులు కూడా సమకూర్చిందని ఆయన తెలిపారు.

రెండవ వర్గం వారు కృష్ణానగర్ వంటి ప్రాంతాల నుండి వస్తుంటారు. వీరికి పరిశ్రమ గురించి పెద్దగా అవగాహన ఉండదు. సొంత ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి, బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతారు. హాస్టళ్లలో ఉండడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం, బంధువులు చిత్ర పరిశ్రమను తక్కువగా చూడటం వల్ల వీరు మానసిక ఒత్తిడికి గురవుతారని విట్టా పేర్కొన్నారు. అలాంటి వారు తనకు ఫోన్ చేసి, “మహేష్! ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పు, ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు, సంపాదించుకొని హాస్టల్‌లో ఉంటాను” అని అడుగుతుంటారని  వివరించారు.

పరిశ్రమలో ఉన్న “కమిట్‌మెంట్ కల్చర్”పై మహేష్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పరిచయాలు లేకపోవడం వల్ల కొందరు దుష్ప్రభావాలకు లోనవుతారని, “ఇదంతా కామన్, చేసుకో, మంచి ఆఫర్ వస్తుంది” అని పక్కవారు ప్రోత్సహిస్తారని ఆయన తెలిపారు. అడగకముందే కమిట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు కొందరు ఉన్నారని, వారిని పక్కవారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని విట్టా చెప్పారు. అయితే, అబ్బాయిలనూ కూడా ఈ కమిట్‌మెంట్ సంస్కృతి వదలదని ఆయన చెప్పడం అప్పట్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది. పెద్ద ప్రొడక్షన్ వారు కూడా తన ఫ్రెండ్‌ను కమిట్‌మెంట్ అడిగారని, ఒకవేళ ఆ కమిట్‌మెంట్ ఇచ్చి ఉంటే వాడి జీవితం మారిపోయేదని ఇప్పుడు తానూ, తన స్నేహితుడూ సరదాగా మాట్లాడుకుంటామని విట్టా వివరించాడు. ఈ ఇండస్ట్రీలో ఒక మంచి విషయం ఏమిటంటే, ఎక్కడ ఉన్నా టాలెంట్ ఉంటే వీడియో చూసి డైరెక్టర్ పిలిచి అవకాశం ఇస్తారని మహేశ్ విట్టా చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.