కేబుల్ బ్రిడ్జిపై మరో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
మాదాపుర్ కేబుల్ బ్రిడ్జిపై మరో రోడ్డు ప్రమాదం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

మాదాపుర్ కేబుల్ బ్రిడ్జిపై మరో రోడ్డు ప్రమాదం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడిపినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గతంలో కూడా మాదాపూర్‌లోని దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జిపై అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువకుడు, యువతికి సల్పగాయాలతో బయటపడ్డారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, పర్యాటకులు కూడా ఉండే కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ అంక్షలు కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
