ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌కు కరోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ ట్వీట్
ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మరో దేశాధినేతకు సోకింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొవిడ్ బారిన పడ్డారు. పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది.

ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మరో దేశాధినేతకు సోకింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొవిడ్ బారిన పడ్డారు. పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది. దీంతో మాక్రాన్ వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
ఈ మేరకు ఎలీసీ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా అత్యధికంగా ప్రభావితం చేసిన దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఆ దేశంలో ఇప్పటివరకు 22 లక్షల మందికి మందికి వైరస్ సోకింది. 59,400 మందికి పైగా మరణించారు. కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
మాక్రాన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచదేశాధినేతలు ఆకాంక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచ్‌లోనూ మోదీ ట్వీట్ చేయడం విశేషం.
Wishing my dear friend @EmmanuelMacron a speedy recovery and the best of health.
— Narendra Modi (@narendramodi) December 17, 2020
