ప్లీజ్ ! వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ రాసిన లేఖను చదవండి, అన్నదాతలకు ప్రధాని మోదీ సూచన, వాస్తవాలు గ్రహించండి
వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీకు రాసిన లేఖను చదవాలని ప్రధాని మోదీ అన్నదాతలను కోరారు. ఆ లేఖలో తోమర్ తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారన్నారు. రైతులంతా దీన్ని చదవడమే గాక, దేశంలో..

వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీకు రాసిన లేఖను చదవాలని ప్రధాని మోదీ అన్నదాతలను కోరారు. ఆ లేఖలో తోమర్ తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారన్నారు. రైతులంతా దీన్ని చదవడమే గాక, దేశంలో అందరికీ చేరేలా చూడాలని ఆయన సూచించారు. దేశంలో ప్రతి వ్యక్తికీ వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. మీతో చర్చలకు కేంద్రం ఇప్పటికీ సిధ్ధంగా ఉందని మోదీ తెలిపారు. అటు- హోం మంత్రి అమిత్ షా..రైతులను ఉద్దేశించి.. 60 ఏళ్లుగా మీ హక్కులను దోచుకున్నవారే ఇప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం మీ ప్రయోజనాలను కాపాడుతోందని, మీ మేలు కోసమే చట్టాలు తెచ్చిందని అన్నారు. మీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇలా ఉండగా రైతుల నిరసనలపై దాఖలైన పిటిషన్లమీద విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. అటు. రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు బీహార్ కు చెందిన ఓ రైతు సైకిల్ పై 11 రోజుల పాటు ప్రయాణించి ఢిల్లీ బోర్డర్ చేరుకోవడం విశేషం.