షార్ట్ కట్ లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎర.. ఫేక్ వీసాలతో డబ్బులు దండుకుంటున్న ఇద్దరు అరెస్ట్

వీసాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

షార్ట్ కట్ లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎర.. ఫేక్ వీసాలతో డబ్బులు దండుకుంటున్న ఇద్దరు అరెస్ట్
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:41 PM

వీసాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన మహ్మద్ అసీబ్ అహ్మద్ అలియాస్ హసీబ్.. మహ్మద్ అహ్మద్ సులేమానిలు ఇంటర్ చదువుతూ.. మధ్యలోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేసారు. అక్కడ వచ్చే సంపాదనతో సంతృప్తి చెందకుండా రాంగ్‌రూట్ పట్టారు. నగరంలో ఓ ఆఫీసు తెరిచి విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు. ఆస్ట్రేలియా, ఓమన్ దేశాలకు పంపిస్తామని చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరవేసి భారీగా డబ్బు వసూలు చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని ఓరిజినల్ పాస్‌పోర్ట్ వాళ్ల దగ్గర పెట్టుకుని భారీగా డబ్బు రాబట్టారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు వీళ్లిద్దర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ వీసాలు, పాస్‌పోర్ట్‌లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.