AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రుల కౌంటర్..హైటెన్షన్‌ డైలాగ్‌లతో హీటెక్కిన ఏపీ పాలిటిక్స్

హైటెన్షన్‌ డైలాగ్‌లు వదులుతూ చెడుగుడు నాని స్వ్కేర్‌ ఆడుకున్నారు. రాయపూడి జనభేరి సభలో చంద్రబాబు చేసిన ప్రతి విమర్శకు కౌంటర్లు ఇచ్చారు. ఒకరిని మించి మరొకరు అటాక్‌ చేశారు. చంద్రబాబు చౌదరి అంటూ మంత్రి...

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రుల కౌంటర్..హైటెన్షన్‌ డైలాగ్‌లతో హీటెక్కిన ఏపీ పాలిటిక్స్
Sanjay Kasula
|

Updated on: Dec 17, 2020 | 10:06 PM

Share

హైటెన్షన్‌ డైలాగ్‌లు వదులుతూ చెడుగుడు నాని స్వ్కేర్‌ ఆడుకున్నారు. రాయపూడి జనభేరి సభలో చంద్రబాబు చేసిన ప్రతి విమర్శకు కౌంటర్లు ఇచ్చారు. ఒకరిని మించి మరొకరు అటాక్‌ చేశారు. చంద్రబాబు చౌదరి అంటూ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేస్తే… ఫేక్‌ జాతీయ పార్టీ నేత అంటూ తనదైన శైలిలో మాట్లాడారు మరో మినిస్టర్‌ కొడాలి నాని.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వయసుకు తగ్గట్టు మాట్లాడటం లేదని ఆక్షేపించారు. చంద్రబాబు పోరాటమంతా ఆయన తనయుడు లోకేష్ కోసమేనని చెప్పారు. రాష్ట్రానికి మంచి చేసేలా చంద్రబాబు వ్యవహరించాలని పేర్ని నాని సూచించారు. చంద్రబాబు ఇచ్చే దొంగ సర్టిఫికెట్ తమకు అక్కర్లేదని చెప్పారు. భవిష్యత్‌లో టీడీపీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజధానిలోని వారు భూమి వద్దు.. ప్లాట్లు కావాలని కోరుతున్నారని తెలిపారు. భూమి వద్దు.. ప్లాట్లు కావాలనే వారు రైతులెందుకు అవుతారు? అని పేర్ని నాని ప్రశ్నించారు.

ఇక టీడీపీపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా బతకడు… బీజేపీని బతకనివ్వడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉంటేనే జగన్‌కు 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 23 సీట్లు మాత్రమే ఇచ్చినా ఇంకా ఏం చేస్తారంటూ తనదైన తరహాలో విమర్శలు గుప్పించాడు. చంద్రబాబును కుప్పంలో ఓడించి రాజకీయంగా ఇంటికి పంపుతామని మండిపడ్డారు. చంద్రబాబు ఒకే రాజధాని కోరుకుంటే పదవికి రాజీనామా చేయాలని ఆయన హితవు పలికారు. అమరావతి రైతులపై ప్రేమ ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

Follow Us
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో